Raghava Lawrence | మీరు ఓకే అంటే నా జర్నీ స్టార్ట్‌చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
Raghava Lawrence | తన పొలిటికల్ ఎంట్రీపై ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) కీలక ప్రకటన చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయాల్లో అడుగుపెడతానని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు, అభిమానుల అభిప్రాయాన్ని కోరారు.
Entertainment | Published On Jun 12, 2026, 11.15 am IST
Raghava Lawrence | ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. తాను రాజీకాయల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. డబ్బు సంపాదించాలనో లేదా పదవులు ఆశించో ఈ నిర్ణయం తీసుకోలేదని రాఘవ లారెన్స్ అందులో స్పష్టం చేశారు.
"నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. డబ్బు సంపాదించాలనో, పదవులు ఆశించో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. నాకు నమ్మకమైన, సన్నిహితమైన వ్యక్తి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే, వారికి అండగా నిలబడి, వ్యక్తిగతంగా నేను చేస్తున్న సేవ కంటే విస్తృత స్థాయిలో సమాజానికి సేవ చేసేందుకు వారితో కలిసి పనిచేయాలన్నదే నా ఏకైక ఆలోచనగా ఉండేది. కానీ నేటి పరిస్థితులు నన్ను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన స్థితికి చేర్చాయి" అని రాఘవ లారెన్స్ తెలిపారు.
తన పొలిటికల్ ఎంట్రీపై ప్రజలు, అభిమానుల అభిప్రాయాన్ని కోరారు. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తే తాను రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. లేదంలో తన ఆలోచనను విరమించుకుంటానని పేర్కొన్నారు. వీడియో చూసిన అనంతరం సలహాలు, సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేయాలని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు.
కాగా, రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై గత కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నేతృత్వంలోని టీవీకేలో చేరే అవకాశం ఉందని తమిళనాట ప్రచారం ఊపందుకుంది. విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ (Trichy East seat) నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం వేళ తన పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ వీడియో ద్వారా స్పష్టతనిచ్చారు.
Do your duty sincerely, without expecting anything in return.
After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter… pic.twitter.com/VwPFjdaUqy
— Raghava Lawrence (@offl_Lawrence) June 12, 2026
రీల్ కాదు.. రియల్ హీరో..
రాఘవ రాలెన్స్ కేవలం సినిమాల్లో హీరో మాత్రమే కాదు. ఎంతో మంది పాలిట రియల్ హీరో. డ్యాన్స్ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా సినిమా రంగంలో ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో, తన దాతృత్వంతో అంతకంటే ఎక్కువ మంది హృదయాలను గెలుచుకున్నాడు. రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్‌ని నెలకొల్పి అనాథ పిల్లలకు, వృద్ధులు, వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తూ పెద్దదిక్కుగా నిలిస్తున్నాడు. అలాగే, వందలాది మంది చిన్నారులకు ఉచితంగా సర్జరీలు చేయించి పునర్జర్మను ప్రసాదించాడు. పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తున్నారు. వారి చదువులకు అయ్యే ఖర్చును మొత్తం భరించడంతో పాటు తన సొంతింటిని సైతం పేద పాఠశాలగా మార్చారు. రైతులకు ట్రాక్టర్లను అందించడంతో పాటు మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లు అందించాడు. ఎంతో మందికి లక్షలాది రూపాయలు అభాగ్యులకు అందించి ఆదుకున్నారు. తన తల్లి పేరు మీద 'కన్మణి అన్నదాన విరుందు' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి పేదలకు ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నాడు. "మనం సంపాదించే దాంట్లో కొంతైనా సమాజానికి తిరిగి ఇవ్వాలి" అనే సిద్ధాంతాన్ని ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Also Read..
వాట్సాప్‌లో షెడ్యూల్డ్ మెసేజ్‌లు.. ఐఫోన్ యూజర్లకు కొత్త ఫీచర్..
ట్రంప్ ప్రకటనతో జోష్‌లో మార్కెట్లు.. సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్..
సంబంధిత వార్తలు

Parthiban | శ్మశానాల పక్కన వైన్ షాప్స్ పెట్టండి – సీఎం విజయ్‌కి కోలీవుడ్ సీనియర్ నటుడి సూచన
జూన్ 9, 2026

Praggnanandhaa | గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో చెస్ ఆడిన తమిళననాడు సీఎం విజయ్
జూన్ 8, 2026

INDIA bloc meet | ‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకి అందని ఆహ్వానం.. కారణం చెప్పిన కాంగ్రెస్
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Meenakshi Natarajan | నామినేషన్ తిరస్కరిస్తే.. ఈసీనే పరిష్కరించాలి : మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- ●Devika Bhatt | టాలీవుడ్లోకి మరో కన్నడ సోయగం- కిరణ్ అబ్బవరంతో రొమాన్స్
- ●Blue Collar Jobs | ఏఐ కోసం బిగ్టెక్ కంపెనీల భారీ పెట్టుబడులు.. లక్షల్లో బ్లూ-కాలర్ ఉద్యోగాల ఖాళీలు..
- ●Petrol Pumps | వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్రం ఆంక్షలు
- ●Uttamkumar Reddy | సమ్మక్క-సారక్క ఎత్తిపోతల పథకానికి NOC ఇవ్వండి
- ●4,000 EVMs destroyed | అగ్నిప్రమాదంలో 4,000 ఈవీఎమ్‌లు దగ్ధం.. కుట్ర కోణం ఉందన్న బెంగాల్ మంత్రి

Meenakshi Natarajan | నామినేషన్ తిరస్కరిస్తే.. ఈసీనే పరిష్కరించాలి : మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ

Devika Bhatt | టాలీవుడ్లోకి మరో కన్నడ సోయగం- కిరణ్ అబ్బవరంతో రొమాన్స్

Blue Collar Jobs | ఏఐ కోసం బిగ్టెక్ కంపెనీల భారీ పెట్టుబడులు.. లక్షల్లో బ్లూ-కాలర్ ఉద్యోగాల ఖాళీలు..

Petrol Pumps | వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్రం ఆంక్షలు



