Mohan Bhagwat | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై రాళ్ల దాడి..!
Mohan Bhagwat | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై రాళ్ల దాడి జరిగింది. మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న లక్నో - ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రాళ్ల దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Mohan Bhagwat | త్రినేత్ర.న్యూస్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై రాళ్ల దాడి జరిగింది. మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న లక్నో - ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రాళ్ల దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురువారం రాత్రి 7.45 గంటలకు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఎతావా - తుండ్ల సెక్షన్ మధ్య పేమేశ్వర్ గేట్ బ్రిడ్జి వద్దకు రాగానే రైలుపై రాళ్లతో దాడి జరిగింది. అయితే ఆ సమయంలో భగవత్ ఈ1 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. ఈ దాడిలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఫిరోజాబాద్ ఎస్పీ ఆదిత్య లాంఘే, ఆగ్రా రైల్వే ఎస్పీ అనిల్ ఝా.. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. రాళ్ల దాడి చేసిన యువకుడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
సంబంధిత వార్తలు

Mohan Bhagwat | పాఠ్యపుస్తకాల్లో హిందూ దేవతల సమాచారం ఉండాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
జులై 25, 2026

Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
జులై 6, 2026

Mohan Bhagwat | హిందువులు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలి : మోహన్ భాగవత్
ఫిబ్రవరి 18, 2026
తాజావార్తలు
- ●Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..
- ●RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్
- ●Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!
- ●TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
- ●South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా
- ●Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?

Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..

RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్

Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!

TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు



