Stock Markets | ట్రంప్ ప్రకటనతో జోష్‌లో మార్కెట్లు.. సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను విరమించుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు, అణ్వాయుధాల అంశంపై ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని వెల్లడించడం ప్రపంచ మార్కెట్లకు సానుకూల సంకేతాలను పంపింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను విరమించుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు, అణ్వాయుధాల అంశంపై ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని వెల్లడించడం ప్రపంచ మార్కెట్లకు సానుకూల సంకేతాలను పంపింది. ఈ పరిణామాలు మదుపర్లలో ఉత్సాహాన్ని నింపడంతో భారత మార్కెట్లు ప్రారంభం నుంచే ర్యాలీ చేశాయి. ఉదయం 9.28 గంటల సమయానికి సెన్సెక్స్ 899 పాయింట్లు లాభపడి 74,731 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 253 పాయింట్లు ఎగబాకి 23,415 వద్ద కొనసాగింది. నిఫ్టీ సూచీలో ఎల్ అండ్ టీ, శ్రీరాం ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజికి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
భారీగా పతనమైన చమురు ధరలు..
ట్రంప్ ప్రకటన ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 88.79 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ చమురు ధర 89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు దిగుమతులపై ఆధారపడే రంగాలకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది. దీంతో విమానయాన, ఆటోమొబైల్, ఫైనాన్షియల్ రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం, ముడిచమురు ధరల తగ్గుదల ప్రభావంతో భారత కరెన్సీ రూపాయి కూడా బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 60 పైసలు పెరిగి 95.25 వద్ద ట్రేడవుతోంది. గురువారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఆసియా మార్కెట్లు కూడా అదే ధోరణిని కొనసాగించడంతో భారత మార్కెట్లకు బలమైన మద్దతు లభించింది. ప్రస్తుతం మదుపర్లు అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి సారిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..
జులై 28, 2026

Manipal Health IPO | ఈ వారంలోనే మణిపాల్ హెల్త్ ఐపీవో.. 4 శాతం లాభాలకు చాన్స్..
జులై 27, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం..
జులై 27, 2026
తాజావార్తలు
- ●Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..
- ●RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్
- ●Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!
- ●TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
- ●South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా
- ●Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?

Stock Markets | ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లలో కొనుగోళ్లు..

RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్

Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!

TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు



