త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aamir Khan | జులై 5న నా పెళ్లి.. ప్ర‌క‌టించిన‌ ఆమిర్ ఖాన్‌

Aamir Khan | బాలీవుడ్ స్టార్ న‌టుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) మ‌రోసారి పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. గ‌త కొన్ని రోజులుగా గౌరి స్ప్ర‌ట్ (Gauri Spratt)తో డేటింగ్‌లో ఉన్న ఈ బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్‌.. జులై 5న ఆమెను వివాహం చేసుకోబోతున్నారు. ఈ విష‌యాన్ని ఆమిర్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

D

Entertainment | Published On Jul 3, 2026, 11.13 am IST

Aamir Khan | జులై 5న నా పెళ్లి.. ప్ర‌క‌టించిన‌ ఆమిర్ ఖాన్‌
Advertisement

Aamir Khan | బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) ముచ్చ‌ట‌గా మూడో పెళ్లికి సిద్ధ‌మ‌య్యారు. త‌న ప్రేయ‌సి గౌరీ స్ప్ర‌ట్ (Gauri Spratt)ను వివాహం చేసుకోబోతున్న‌ట్లు ఆమిర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. జులై 5వ తేదీన గౌరీని మ‌నువాడ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎలాంటి ఆడంబ‌రాలూ లేకుండా ముంబైలోని త‌న నివాసంలోనే (Mumbai Home) అతికొద్ది మంది కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో సింపుల్‌గా వేడుక నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. జులై 5న త‌మ‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైన రోజు అని, అంద‌రి దీవెన‌లు, ఆశీస్సులు త‌మ‌పై ఉండాల‌ని ఆమిర్ చెప్పుకొచ్చారు. పెళ్లి డేట్ ప్ర‌క‌టించ‌గానే ఆమిర్‌కు మీడియా మిత్రులు కంగ్రాట్స్ చెప్పారు.

గ‌తంలో రెండు పెళ్లిళ్లు..

ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో పెళ్లి. 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న ఆమిర్‌.. 2002లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌ మహిళా డైరెక్టర్‌ కిరణ్‌ రావుతో ప్రేమలో పడి.. 2005లో పెళ్లిపీటలెక్కాడు. ఈ జంట కూడా 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్ద‌రి నుంచి విడిపోయిన‌ప్ప‌టికీ వారితో స్నేహం కొన‌సాగిస్తూ ప‌లు కార్య‌క్ర‌మాల్లో మాజీ భార్య‌ల‌తో ఆమీర్ సంద‌డి చేస్తుంటారు.

ఇక ఆమీర్ ప్ర‌స్తుతం గౌరీతో డేటింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం తన ఆరేళ్ల కొడుకుతో కలిసి గౌరీ బెంగళూరులోనే ఉంటున్నారు. ఈమె తల్లి కూడా సెలెబ్రిటీ స్టయిలిస్ట్‌. వీరికి బెంగళూరు, ముంబయి నగరాల్లో సెలూన్లు ఉన్నాయి. రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఆమిర్‌ – గౌరీ ఇప్పుడు వివాహ బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు.

Also Read..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. భారీ వర్షంలోనూ త‌ర‌లివెళ్తున్న‌ భ‌క్తులు

ఉద్యోగుల‌కు ఐటీఆర్‌-1లో భారీ ఊర‌ట‌.. సులభంగా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు..

అమెజాన్ ప్రైమ్ డే 2026 బంపర్ డీల్స్.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై భారీ తగ్గింపులు..

Advertisement
Advertisement