Ameesha Patel | బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో దొంగతనం – పనిమనిషి అరెస్ట్
బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో దొంగనతం జరిగింది. ఐదు లక్షల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు గాజులతో పాటు మరికొన్ని ఖరీదైన ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. ఈ దొంగతనానికి సంబంధించి అమీషా పటేల్ ఇంట్లో పనిచేసే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Entertainment | Published On Sep 12, 2026, 3.33 pm IST
Ameesha Patel | బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ చోరీకి సంబంధించి ఇంట్లో పనిచేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ముంబాయిలోని చర్చిగేట్ సమీపంలో అమీషా పటేల్ కుటుంబం నివాసం ఉంటుంది ఆమె తల్లితో పాటు కొంతమంది బంధువులు ఈ ఇంట్లో ఉంటున్నారు.
ఖరీదైన నగలు...
ఇటీవలే ఈ ఇంట్లో దొంగతనం జరిగింది. ఐదు లక్షల విలువైన వజ్రాలు పొదిగిన ఓ బంగారు గాజుతో పాటు మరికొన్ని ఖరీదైన ఆభరణాలు చోరీకి గురయ్యారు. ఈ దొంగనతంపై అమీషా పటేల్ తల్లి ఆశా పటేల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
ఇంట్లో పనిచేసే వ్యక్తి...
పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో అమీషా పటేల్ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఒకరు ఈ దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడైంది. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడి నుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ చోరీపై అమీషా పటేల్ ఫ్యామిలీ రియాక్ట్ కాలేదు.
స్టార్ హీరోయిన్‌గా...
2000 దశకంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరుతెచ్చుకుంది అమీఫా పటేల్. కహో నా ప్యార్ హై బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అమీషా పటేల్ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో మహేష్‌బాబు నాని, ఎన్టీఆర్ నరసింహుడు సినిమాలు చేసింది. 2017లో వచ్చిన భయ్యాజీ సూపర్ హిట్ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అమీషా పటేల్ గదర్ 2తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. సన్నీడియోల్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో ఆరు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది.
సంబంధిత వార్తలు

Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ – ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్
సెప్టెంబర్ 11, 2026

Deepika Padukone | దీపికా పడుకోణ్‌తో సినిమా – నా కెరీర్లో చేసిన పెద్ద తప్పు – బాలీవుడ్ హీరో కామెంట్స్
సెప్టెంబర్ 11, 2026

Tripti Dimri | అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్రలో తిప్తి డిమ్రి – వెండితెరపైకి ట్రాజెడీ లవ్‌స్టోరీ
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Gangula Kamalakar in role of Ponguleti | కాంగ్రెస్ గెలవాలని మస్తు ఖర్సువెట్టిన.. ఇప్పుడవన్నీ సంపాదించొద్దా
- ●OpenAI | ఆర్థిక సేవలను అందించనున్న చాట్ జీపీటీ.. ఓపెన్ఏఐ కొత్త ఫీచర్..
- ●TG Weather | ఈ ఐదు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
- ●GHMC Sports Grounds Privatization | పేద, మధ్యతరగతి పిల్లలకు ఆట స్థలాలను దూరం చేస్తారా?
- ●Trisha | దళపతి విజయ్ విజయ్ మీటింగ్ - త్రిష షూటింగ్ - ఇద్దరూ లండన్‌లోనే!
- ●Vemula Prashanth Reddy | పేగులు మెడలేసుకుంటే 24 గంటల కరెంట్ రాలే అధ్యక్షా

Gangula Kamalakar in role of Ponguleti | కాంగ్రెస్ గెలవాలని మస్తు ఖర్సువెట్టిన.. ఇప్పుడవన్నీ సంపాదించొద్దా

OpenAI | ఆర్థిక సేవలను అందించనున్న చాట్ జీపీటీ.. ఓపెన్ఏఐ కొత్త ఫీచర్..

TG Weather | ఈ ఐదు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

GHMC Sports Grounds Privatization | పేద, మధ్యతరగతి పిల్లలకు ఆట స్థలాలను దూరం చేస్తారా?



