త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonam Wangchuk | సోన‌మ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష – బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు – కార‌ణం ఇదే!

నీట్ పేప‌ర్ లీకేజీపై విద్యా వేత్త సోన‌మ్ వాంగ్ చుక్ చేస్తోన్న నిరాహార దీక్ష ప‌దిహేడ‌వ రోజుకు చేరుకుంది. అత‌డి ఉద్య‌మానికి ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు నిస్తున్నారు. ఆమీర్‌ఖాన్‌తో పాటు త్రీ ఇడియ‌ట్స్ మేక‌ర్స్ ఎవ‌రూ సోన‌మ్ దీక్ష‌కు స‌పోర్ట్ చేయ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. సోన‌మ్ వాంగ్ చుక్ జీవితం ఆధారంగానే ఆమిర్‌ఖాన్ త్రీ ఇడియ‌ట్స్ మూవీ రూపొంద‌డం గ‌మ‌నార్హం.

N

Entertainment | Published On Jul 14, 2026, 6.46 pm IST

Sonam Wangchuk | సోన‌మ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష – బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు – కార‌ణం ఇదే!
Advertisement

Sonam Wangchuk | నీట్ లీక్‌తో పాటు విద్యా వ్య‌వ‌స్థ‌లోని అవ‌క‌త‌వ‌క‌ను నిర‌సిస్తూ సామాజిక కార్య‌క‌ర్త‌, విద్యావేత్త సోన‌మ్ వాంగ్ చుక్ గ‌త ప‌దిహేడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ లీకేజ్ స్కామ్‌కు కేంద్ర విద్యా శాఖ మంత్రి బాధ్య‌త వ‌హిస్తూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ సోన‌మ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీతో క‌లిసి వాంగ్‌చుక్ చేస్తోన్న ఈ దీక్ష‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. నిరాహార దీక్ష ప‌దిహేడ‌వ రోజుకు చేరుకోవ‌డంతో వాంగ్‌చుక్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

త్రీ ఇడియ‌ట్స్‌...

కాగా సోన‌మ్ వాంగ్‌చుక్‌కు త్రీ ఇడియ‌ట్స్ మూవీ టీమ్‌ ఎవ‌రూ స‌పోర్ట్ చేయ‌క‌పోవ‌డంపై నెటిజ‌న్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సోన‌మ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగానే త్రీ ఇడియ‌ట్స్ మూవీ రూపొందింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీలో సోన‌మ్ వాంగ్‌చుక్ పాత్ర‌లో ఆమిర్ ఖాన్ న‌టించాడు. ఫున్‌సుక్ వాంగ్డూ రాంచో అనే పాత్ర‌లో క‌నిపించారు.సోన‌మ్ బ‌యోపిక్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కేవ‌లం 55 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 400 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

నెటిజ‌న్ల ట్రోల్‌....

సోన‌మ్ నిరాహార దీక్ష కార‌ణంగా త్రీ ఇడియ‌ట్స్ మూవీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఆమిర్‌ఖాన్‌, డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరానీతో పాటు త్రీ ఇడియ‌ట్స్ టీమ్ మెంబ‌ర్స్ ఎవ‌రూ కూడా సోన‌మ్ దీక్ష‌కు స‌పోర్ట్ చేయ‌క‌పోవ‌డంపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సోన‌మ్‌ జీవితాన్ని అడ్డుపెట్టుకొని ఆమిర్ ఖాన్‌, రాజ్‌కుమార్ హిరానీ భారీగా డ‌బ్బులు సంపాదించుకున్నార‌ని, అత‌డు క‌ష్టాల్లో ఉంటే మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. మంచి కోస‌మే చేస్తోన్న పోరాటానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా సైలెంట్‌గా ఉండ‌టం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు. అభ‌య్ డియోల్‌, ఓమీ వైద్య‌, న‌సిరుద్దీన్ షా వంటి బాలీవుడ్ ప్ర‌ముఖులు సోన‌మ్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఆమిర్‌పై విమ‌ర్శ‌లు మ‌రింత‌గా పెరిగాయి.

మౌనానికి కార‌ణం ఇదేనా?

ఆమిర్ ఖాన్‌తో పాటు త్రీ ఇడియ‌ట్స్ టీమ్ మౌనం వెనుక చాలానే కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు. సోన‌మ్ వాంగ్‌చుక్ దీక్ష రాజ‌కీయ అంశాల‌తో ముడిప‌డి ఉండ‌టంతోనే ఆమిర్ స‌పోర్ట్ చేయ‌డం లేద‌ని స‌మాచారం. నీట్ లీక్‌తో పాటు ల‌డ‌ఖ్‌కు ప్ర‌త్యేక హోదా కావాలంటూ సోన‌మ్ వాంగ్ చుక్ డిమాండ్ చేస్తున్నారు. అది చాలా సున్నిత‌మైన అంశం కావ‌డంతోనే బాలీవుడ్ యాక్ట‌ర్లు సోన‌మ్ దీక్ష‌కు మ‌ద్ద‌తునివ్వ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో ప‌లు సామాజిక ఉద్య‌మాల‌పై ఆమిర్‌ఖాన్ రియాక్ట్ అయ్యారు. వాటి కార‌ణంగా అత‌డిపై చాలానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ కామెంట్ల వ‌ల్ల‌నే పీకేతో పాటు ఆమిర్ ఖాన్ న‌టించిన మ‌రికొన్ని సినిమాల‌ను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునివ్వ‌డంతో భారీగా న‌ష్ట‌పోయారు. గ‌త చేదు అనుభ‌వాల కార‌ణంగానే ఆమిర్ మౌనంగా ఉన్నాడంటూ అత‌డి అభిమానులు చెబుతున్నారు.

 

Advertisement
Advertisement