Amir Khan | ఆమిర్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..
Amir Khan | బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట ఉన్న ఫేస్‌బుక్ ఖాతా అకౌంట్ నుంచి ఆమిర్‌ను బెదిరించారు.
Entertainment | Published On Jul 18, 2026, 3.43 pm IST
Amir Khan | బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట ఉన్న ఫేస్‌బుక్ ఖాతా అకౌంట్ నుంచి ఆమిర్‌ను బెదిరించారు. ఆ పోస్టులో "నేను అర్జు బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ (లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్). మన దేశ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేసేవారిని, 'లవ్ జిహాద్' పేరుతో అలాంటి అంశాలను ప్రోత్సహిస్తున్న ఆమిర్ ఖాన్ వంటి వారిని మేం సహించం. ఆమిర్ ఖాన్‌కు త్వరలోనే తగిన సమాధానం ఇస్తాం. స్టార్‌డమ్ పేరుతో ఇలాంటి విషయాలను ప్రోత్సహించడం మన సనాతన ధర్మానికీ, దేశానికీ వ్యతిరేకం. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం" అని పోస్టులో హెచ్చరించారు.
పోలీసుల స్పందన
ఈ బెదిరింపులపై ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ గానీ, ఆయన బృందం నుంచి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ముంబయి పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు గురించి మీడియా కథనాలతో మాత్రమే విషయం తెలిసిందని పేర్కొన్నారు. వైరల్ అవుతున్న పోస్టు నిజమేనా? ఫేకా అని తెలుసుకునేందుకు ప్రత్నిస్తున్నట్లు తెలిపారు. ఆమిర్ నుంచి అధికారికంగా ఫిర్యాదు అందితే దర్యాప్తును ప్రారంభిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆమిర్ ఖాన్ ఈ నెల గౌరీ స్ప్రాట్‌ను మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బాంద్రాలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం సాదాసీదాగా జరిగింది.
ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో పెళ్లి
ఆమిర్ ఖాన్ తొలి భార్య రీనా దత్తా. వీరిద్దరి వైవాహిక జీవితం 1986 నుంచి 2002 వరకు కొనసాగింది. అనంతరం దర్శకురాలు కిరణ్ రావును 2005లో వివాహం చేసుకున్నారు. ఈ జంట సైతం 2021లో విడిపోయింది. తాజాగా జూలై 5న గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకొని.. మూడోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు
- ●Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ
- ●Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్
- ●Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Peddi Sudarshan Reddy | నిలకడగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం.. హైదరాబాద్‌కు తరలింపు

Beware of Frauds| మేం అడిగినంత ఇవ్వండి..మీకు ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ

Telugu OTT | ఓటీటీలోకి షాకింగ్ ట్విస్ట్‌లతో సాగే తెలుగు లవ్‌స్టోరీ - చెప్పిన డేట్ కంటే ఓ రోజు ముందే స్ట్రీమింగ్

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..






