Revanth Reddy | సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు
Revanth Reddy | పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) త్వరలో విదేశీ పర్యటినకు వెళ్లనున్నారు. దీంతో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly Session) ఆలస్యం కానున్నాయి.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) త్వరలో విదేశీ పర్యటినకు వెళ్లనున్నారు. దీంతో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly Session) ఆలస్యం కానున్నాయి. సీఎం రేవంత్ ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 8 వరకు దాదాపు 20 రోజులపాటు అమెరికా, యూకే సహా మరికొన్ని దేశాల్లో (Foreign Tour) పర్యటనున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి సంస్థలు, ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. ఐటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ రంగాల ప్రతినిధులతో చర్చించనున్నారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఆలస్యం కానున్నాయి. సీఎం విదేశాల నుంచి తిరిగివచ్చిన తర్వాత సెప్టెంబర్ మూడో వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను (Assembly Monsoon Session) నిర్వహించే అవకాశం ఉంది. కాగా, చట్టసభల్లోకి ప్రవేశించే వయసును 21కి తగ్గించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆగష్టు 17-18 తేదీల్లో ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం.
తాజావార్తలు
- ●Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?
- ●Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!
- ●Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ
- ●Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?
- ●OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..
- ●Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే

Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?

Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!

Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?





