Traffic Restrictions | ఉజ్జయిని మహంకాళి బోనాలు.. హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | ఆగస్టు 2న (ఆదివారం) సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు (Ujjaini Mahankali Bonalu) సమర్పించనున్నారు. ఈనేపథ్యంలో నగరంలోని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
Traffic Restrictions | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల జాతర (Bonalu) హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఆషాఢమాసంలో ప్రతి ఆదివారం నగంలోని ఒక్కో ప్రాంతంలో బోనాల పండుగ జరుపుకుంటారు. ఆగస్టు 2న (ఆదివారం) సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు (Ujjaini Mahankali Bonalu) సమర్పించనున్నారు. ఈనేపథ్యంలో నగరంలోని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆగస్టు 2 నుంచి 4వ తేదీవరకు ఆలయ పరిసరాల్లో 2 కిలోమీటర్ల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 4న తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు జాతర పూర్తయ్యే వరకు కొన్ని మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఉజ్జయిని మహంకాళి బోనాలు
- ఆగస్టు 2న- ఉదయం 4 గంటల నుంచే అమ్మవారికి బోనాల సమర్పన
- ఆగస్టు 3న- ఉదయం 8.30 గంటలకు భవిష్యవాణి వినిపించే రంగం కార్యక్రమం. ఉదయం 10.30 గంటలకు అమ్మవారి గజవాహన ఊరేగింపు
మళ్లింపులు ఇలా..
- పాట్నీ క్రాస్ రోడ్స్: ఎస్బీఐ, ప్యారడైజ్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను మినిస్టర్ రోడ్, క్లాక్ టవర్, సంగీత్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్, కవాడిగూడ మీదుగా మళ్లిస్తారు. ప్యారడైజ్ నుంచి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహనాలను ఎస్బీఐ లేదా క్లాక్ టవర్ మీదుగా మళ్లిస్తారు.
- ఘస్‌మండి: బైబిల్ హౌస్ నుంచి రైల్వే స్టేషన్, తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను సజ్జన్‌లాల్ స్ట్రీట్, రైల్వే స్టేషన్ మీదుగా లేదా హిల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా మళ్లిస్తారు.
- బైబిల్ హౌస్: జబ్బార్ కాంప్లెక్స్, బన్సీలాల్‌పేట్ నుంచి వచ్చే వాహనాలను కర్బలా, రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
- కర్బలా: చిల్డ్రన్స్ పార్క్, బైబిల్ హౌస్ దిశల నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.
- రాణిగంజ్: కర్బలా మైదాన్ నుంచి రైల్వే స్టేషన్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, సాధారణ వాహనాలను మినిస్టర్ రోడ్, రసూల్‌పురా, పీఎన్టీ ఫ్లై ఓవర్, సీటీవో, ఎస్బీఐ, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, గోపాలపురం మీదుగా మళ్లిస్తారు. రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను చిలకలగూడ, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా మళ్లిస్తారు.
- ప్యారడైజ్: సీటీవో నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్లే వాహనాలను సింధీ కాలనీ, మినిస్టర్ రోడ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ మీదుగా మళ్లిస్తారు. పాట్నీ నుంచి వచ్చే వాహనాలను సీటీవో జంక్షన్ వైపు మళ్లిస్తారు.
కాగా, భక్తుల సౌకర్యార్ధం హరిహర కళాభవన్, యశోద హాస్పిటల్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ షాపింగ్ మాల్, పాత జైలు ఖానా ఖాళీ స్థలం, ఇస్లామియా హై స్కూల్, ప్రభుత్వ అడవయ్య మెమోరియల్ హై స్కూల్, నల్లగుట్ట జీహెచ్ఎంసీ గ్రౌండ్, మహాత్మా గాంధీ విగ్రహం ఎంజీ రోడ్, పార్సీ టెంపుల్, వెస్లీ కాలేజీ లేదా జీహెచ్ఎంసీ, జింఖానా గ్రౌండ్, స్వప్నలోక్ కాంప్లెక్స్, తాజ్ త్రీ స్టార్ లైన్ ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆయా మార్గాల్లో ఆలయానికి వచ్చే భక్తులు తమ వాహనాలను నిర్ధేశించిన ప్రాంతాల్లో నిలపాని సూచించారు. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
సంబంధిత వార్తలు

Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
అక్టోబర్ 3, 2026

Special Train | ఈ నెల 4, 5 తేదీల్లో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు..
అక్టోబర్ 3, 2026

Arms Theft Case | మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీలో విస్తుపోయే విషయాలు..!
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?
- ●Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!
- ●Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ
- ●Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?
- ●OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..
- ●Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే

Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?

Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!

Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?



