Uttam Kumar Reddy | గౌరవెల్లి భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy | గౌరవెల్లి భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమర్‌రెడ్డి సూచించారు. భూసేకరణ, పునరావాస సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్: గౌరవెల్లి భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమర్‌రెడ్డి సూచించారు. భూసేకరణ, పునరావాస సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. భూసేకరణకు అవసరమైన నిధులు ఇప్పటికే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు చేరాయని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో శనివారం భూసేకరణ, పునరావాసంపై ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు ఉత్తమ్ పలు సూచనలు చేశారు. సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల భూసేకరణ వివరాలు, పెండింగ్ అంశాలపై పరిశీలన చేపట్టారు. అటవీ నోటిఫికేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ప్రాజెక్టుకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి. ఎడమ, కుడి కాలువల అంచనాలు, ప్రతిపాదనలు చేయండి. పంపిణీ కాలువల టెండర్ ప్రతిపాదనల స్థితిపై పరిశీలిస్తున్నాం. ప్రాజెక్టులో నీటిని నింపడం, విడుదల నివేదికలపై దృష్టి పెడుతున్నాం. పర్యావరణ అనుమతులు, ఎన్‌జీటీ కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించాం. ఎంఎంఆర్ ప్యాకేజీ-3 ప్రతిపాదనలపై సమీక్షించాను అని ఉత్తమ్ తెలిపారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, మహబూబాబాద్ లోకసభ సభ్యులు బలరాం నాయక్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, భూసేకరణ-పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్‌సీ జనరల్ రమేష్ బాబు, ఇ.ఎన్ సీ ఓ అండ్ యం మధుసూదన్ రావు, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్ తదితరులు సమీక్షకు హాజరయ్యారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Stock Markets | అక్టోబర్‌లో మార్కెట్లకు మరో పరీక్ష.. కీలకం ఈ 5 అంశాలే..
- ●Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలి
- ●Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ - లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ
- ●CJP | అక్టోబర్ 10న చలో జంతర్ మంతర్.. సీజేపీ కీలక ప్రకటన
- ●Janhvi Kapoor |జాన్వీకపూర్ డీప్ ఫేక్ వీడియో - ఎవరిని వదిలిపెట్టనంటూ జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్
- ●Man Jumps Off 43rd Floor | షాకింగ్.. 43వ అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.. రెండు ముక్కలైన బాడీ

Stock Markets | అక్టోబర్‌లో మార్కెట్లకు మరో పరీక్ష.. కీలకం ఈ 5 అంశాలే..

Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలి

Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ - లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ

CJP | అక్టోబర్ 10న చలో జంతర్ మంతర్.. సీజేపీ కీలక ప్రకటన





