Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
బొల్లారం సైనిక స్థావరంలో ఆయుధాల దొంగతనం వెనుక భారీ కుట్ర. ముగ్గురు ఆర్మీ జవాన్లు సహా ఏడుగురి అరెస్ట్.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు!
సంక్షిప్త సారాంశం
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారంలో జరిగిన మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో ముగ్గురు ప్రస్తుత ఆర్మీ ఉద్యోగులతో సహా ఏడుగురిని మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకులు, నగల దుకాణాలు, ధనికుల ఇళ్లలో సాయుధ దోపిడీలు చేయడానికే ఈ ఆయుధాలను దొంగిలించినట్లు విచారణలో తేలింది. నిందితుడు మాజీ హవల్దార్ మల్లేష్ వెస్ట్ బెంగాల్‌కు చెందిన కాంటాక్టులకు ఆర్మీ ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకునేందుకు సైతం డీల్ కుదుర్చుకున్నాడు. ఈ కేసుకు ఎటువంటి ఉగ్రవాద లేదా తీవ్రవాద సంబంధాలు లేవని, కేవలం దోపిడీల కోసమే పథకం పన్నారని పోలీసులు స్పష్టం చేశారు.
Bolarum Arms Theft | త్రినేత్ర న్యూస్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్‌లో సైనిక ఆయుధాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ దొంగతనం వెనుక బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, సంపన్నుల ఇళ్లలో వరుస దోపిడీలు చేయాలన్న పక్కా ప్లాన్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. తొలుత ఈ నేరం తానొక్కడినే చేశానని నమ్మబలికిన రిటైర్డ్ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్ (37) అసలు నెట్‌వర్క్‌ను పోలీసులు చేధించారు. శనివారం ముగ్గురు సర్వీసులో ఉన్న ఆర్మీ జవాన్లు సహా మరో ఏడుగురు నిందితులను మల్కాజ్‌గిరి కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు
ఈ కేసులో పట్టుబడిన సైనికుల్లో ఏపీకి చెందిన సిపాయి కొండూరి శేషులు (36-మార్కాపురం), నాయక్ వినోద్ కుమార్ (34-మార్కాపురం)లతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గుండ్లపోటపల్లికి చెందిన హవల్దార్ కూచరకంటి ప్రవీణ్ (37) ఉన్నారు.
వీరితో పాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన అవి దే అలియాస్ ఓబీ (32), బారక్‌పూర్ కంటోన్మెంట్ వద్ద చెరకు రసం వ్యాపారం చేసే బీర్బల్ షా (27), నాగర్‌కర్నూల్ జిల్లా పదరకు చెందిన తాపీ మేస్త్రీ ఉప్పుతోళ్ల మల్లికార్జున్ (39-మల్లేష్ బంధువు), అదే ప్రాంతానికి చెందిన కిరాణా వ్యాపారి చెమ్మకార్ నిరంజన్ (39) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దోపిడీలు, ఆయుధాల అమ్మకానికి డీల్
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బంధువు మల్లికార్జున్, మిత్రుడు నిరంజన్‌లతో కలిసి మల్లేష్ భారీ దోపిడీలకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం తుపాకులు అవసరం పడటంతో పశ్చిమ బెంగాల్‌లోని పాత పరిచయస్తులైన అవి దే, బీర్బల్ షాలను సంప్రదించాడు. అక్కడ ఆలస్యం కావడంతో, తాను గతంలో పనిచేసిన మద్రాస్ రెజిమెంట్‌లో ఉన్న శేషులు, వినోద్ కుమార్, ప్రవీణ్‌లతో చేతులు కలిపాడు.
ఆ ముగ్గురు సైనికుల సహకారంతో బొల్లారంలోని కోట్ (Kote), మ్యాగజైన్ తాళాలు పగలగొట్టి అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్లను మల్లేష్ తస్కరించాడు. అంతేకాకుండా ఆర్మీ పిస్టళ్లను ఒక్కొక్కటి రూ.3 లక్షలకు, లాంగ్ వెపన్లను రూ.5 లక్షలకు అమ్ముతానని వెస్ట్ బెంగాల్‌కు చెందిన అవి దే అలియాస్ ఓబీతో బేరం కుదుర్చుకున్నట్లు పోలీసుల కస్టడీలో వెల్లడైంది.
స్వాధీనం చేసుకున్న భారీ ఆయుధ సంపత్తి
ఆగస్టు 31న ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాలు మాయమైన విషయం వెలుగులోకి రాగా.. సెప్టెంబర్ 11న మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 4 ఏకే-203 రైఫిళ్లు (5 మ్యాగజైన్లు), 1 ఇన్సాస్ (INSAS) రైఫిల్ (3 మ్యాగజైన్లు), 6 అత్యాధునిక 9mm పిస్టళ్లు (12 మ్యాగజైన్లు), ఒక సివిలియన్ పిస్టల్, 3 బైనాక్యులర్లు.. మొత్తం 1,912 లైవ్ రౌండ్ల మందుగుండు సామగ్రిని పోలీసులు రికవరీ చేశారు.
గతంలో అచ్చంపేట, అమ్రాబాద్ పీఎస్‌లలో మల్లేష్‌పై చోరీ కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ ఆయుధాల చోరీ పూర్తిగా భారీ ఆస్తి నేరాలు, దోపిడీల కోసమే జరిగిందని, ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని సీపీ సుమతి స్పష్టం చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు
- ●Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్
- ●Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!
- ●Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి
- ●Priyanka Kakkar | ఆప్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్
- ●Primebook 3 Max | రూ.35,990కే ప్రైమ్బుక్ 3 మ్యాక్స్.. ఏఐ ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్..

India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు

Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్

Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!

Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి




