Tim Cook | నేనెప్పుడూ అలా చెప్పలేదు.. రిటైర్మెంట్ వార్తలపై టిమ్ కుక్ క్లారిటీ
Tim Cook | రిటైర్మెంట్ వార్తలపై యాపిల్ సీఈవో (Apple CEO) టిమ్ కుక్ తాజాగా స్పందించారు. అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేశారు (Tim Cook shuts down retirement buzz ). తాను ఇప్పుడప్పుడే సీఈవో బాధ్యతల నుంచి తప్పుకునే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు.
Tim Cook | అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ (Apple) నాయకత్వంలో భారీ మార్పులు జరగబోతున్నాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఈవోగా (Apple CEO) వ్యవహరిస్తున్న టిమ్ కుక్ (Tim Cook) తన పదవి నుంచి వైదొలగబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టిమ్ కుక్ 65 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పదవీ విరమణ (retirement) చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై టిమ్ కుక్ తాజాగా స్పందించారు. రిటైర్మెంట్ వార్తలను తీవ్రంగా ఖండించారు. అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేశారు (Tim Cook shuts down retirement buzz ).
ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టిమ్ కుక్ మాట్లాడుతూ ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా.. మీరు యాపిల్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారా..? అని విలేకరు ప్రశ్నించారు. దీనికి టిమ్ కుమ్ బదులిస్తూ.. "లేదు.. నేను అలా అనలేదు. నేను ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. అది కేవలం రూమర్ మాత్రమే" అని స్పష్టం చేశారు. చేసే పనిని తాను ఎంతో ఇష్టంతో చేస్తానని తెలిపారు. యాపిల్‌తో తనకున్న అనుబంధం ఎంతో బలమైనదని చెప్పుకొచ్చారు. తాను ఇప్పుడప్పుడే సీఈవో బాధ్యతల నుంచి తప్పుకునే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు. "చేసే పనిని నేను ఎంతగానో ప్రేమిస్తాను. యాపిల్ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను (cannot imagine life without Apple)" అని టిమ్‌కుక్ స్పష్టం చేశారు.
ఇక ఇదే సందర్భంగా యాపిల్ విస్తరణపై టిమ్‌కుక్ మాట్లాడుతూ.. రాబోయే నాలుగేళ్లలో అమెరికాలో 600 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఐఫోన్ గ్లాస్, సెమీకండక్టర్ల వంటి కీలక భాగాల స్వదేశీ తయారీని పెంచడం, ప్రపంచ సరఫరా గొలుసులకు అవసరమైన ఉత్పత్తులను అందించడం వంటివి ఉన్నాయి.
2011లో టిమ్ కుక్ యాపిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేశారు. గత 15 ఏళ్లలో యాపిల్ రూపురేఖలను తీర్చిదిద్దడంలో కుక్ కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో కంపెనీ తన ఉత్పత్తి శ్రేణిని భారీగా విస్తరించింది. అంతేకాదు కంపెనీ విలువ 350 బిలియన్ డాలర్ల నుంచి 4 ట్రిలియన్ డాలర్లకుపైగానే చేరుకోవడం విశేషం. అయితే, ప్రస్తుతం టిమ్ కుక్ 65 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో గత ఐదు నెలలుగా కుక్ యాపిల్ సీఈవో పదవి నుంచి వైదొలగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఆయన స్వయంగా స్పష్టతనిచ్చారు.
Also Read..
ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి
విమాన ప్రయాణికులకు కేంద్రం భారీ ఊరట.. సీట్ల దోపిడీకి చెక్
ఇండోర్‌లో దారుణం.. ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
సంబంధిత వార్తలు

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

iPhone 17 | మదర్ప్ డే సందర్భంగా యాపిల్ సేల్.. ఐఫోన్ 17 ధర భారీగా తగ్గింపు..
మే 6, 2026

Apple | యాపిల్ యూజర్లకు బంపర్ ఫీచర్.. ఇకపై డివైస్‌లలో నచ్చిన ఏఐ మోడల్‌ను ఎంచుకోవచ్చు..
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



