Apple | యాపిల్ కొత్త ఐమ్యాక్, మ్యాక్‌బుక్ ప్రొ వచ్చేశాయి.. ధరలు ఎంతంటే..?
Apple | యాపిల్ కొత్త ఎం6 చిప్‌తో 14 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రొ, 24 ఇంచుల ఐమ్యాక్ కంప్యూటర్లను లాంచ్ చేసింది. మెరుగైన పనితీరు, వేగవంతమైన ఏఐ ప్రాసెసింగ్, వైఫై 7 కనెక్టివిటీ వీటి ప్రత్యేకతలు. బుధవారం నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా, నవంబర్ 6 నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి.
Technology | Published On Oct 28, 2026, 1.50 pm IST
Apple | యాపిల్ కొత్త ఎం6 చిప్‌తో 14 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రొ, 24 ఇంచుల ఐమ్యాక్ కంప్యూటర్లను లాంచ్ చేసింది. మెరుగైన పనితీరు, వేగవంతమైన ఏఐ ప్రాసెసింగ్, వైఫై 7 కనెక్టివిటీ వీటి ప్రత్యేకతలు. బుధవారం నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా, నవంబర్ 6 నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి.
కొత్త 14 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రొ ఎం6లో 12-కోర్ సీపీయూ, 12-కోర్ జీపీయూ, 16 జీబీ నుంచి 32 జీబీ వరకు యూనిఫైడ్ మెమరీ సదుపాయం ఉన్నాయి. గ్రాఫిక్స్ పనితీరు గత ఎం5 మోడల్‌తో పోలిస్తే 30 శాతం వరకు మెరుగుపడిందని యాపిల్ వెల్లడించింది. వైఫై 7, బ్లూటూత్ 6, 24 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్ బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉన్నాయి. భారత్‌లో ప్రారంభ ధర రూ. 2,39,900గా ఉంది.
కొత్త 24 ఇంచుల ఐమ్యాక్ ఎం6లో 4.5కె రెటినా డిస్‌ప్లే, 12-కోర్ వరకు సీపీయూ, 12-కోర్ వరకు జీపీయూ, 32 జీబీ వరకు మెమరీ సదుపాయం ఉన్నాయి. స్థానికంగా ఏఐ పనులను వేగంగా నిర్వహించేలా దీన్ని రూపొందించారు. వై-ఫై 7, బ్లూటూత్ 6, 12 మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ కెమెరా, ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టమ్ ప్రత్యేకతలు. దీని ప్రారంభ ధర రూ. 1,74,900గా ఉంది. దేశవ్యాప్తంగా వినియోగదారులు యాపిల్ అధికారిక పార్ట్‌నర్‌షిప్ స్టోర్లు, ఆన్‌లైన్ స్టోర్లతోపాటు యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లోనూ వీటిని ఆర్డర్ చేయవచ్చు.
తాజావార్తలు
- ●India invites Pakistan | భారత్ నుంచి పాక్‌కు ఆహ్వానం.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి అధికారిక పిలుపు
- ●Captain Smit Machchhar | ఫ్లై దుబాయ్ హీరోకి అరుదైన గౌరవం.. స్మిత్‌ను అత్యున్నత పురస్కారంతో సత్కరించిన యూఏఈ
- ●Harish Rao | ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ.. ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటు: హరీశ్ రావు
- ●Ponnam Prabhakar | చరిత్రలో నిలిచిపోయేలా.. భవిష్యత్ తరాలకు అందించేలా ఉస్మానియా దవాఖాన నిర్మాణం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Rahul Gandhi | టాటా సంస్థను నేరపూరితంగా నాశనం చేస్తున్నారు : రాహుల్ గాంధీ
- ●Gold Prices | బంగారం కొనుగోళ్లను తగ్గించిన వ్యాపారులు.. ధరలు పతనమవుతాయా..?

India invites Pakistan | భారత్ నుంచి పాక్‌కు ఆహ్వానం.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి అధికారిక పిలుపు

Captain Smit Machchhar | ఫ్లై దుబాయ్ హీరోకి అరుదైన గౌరవం.. స్మిత్‌ను అత్యున్నత పురస్కారంతో సత్కరించిన యూఏఈ

Harish Rao | ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ.. ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటు: హరీశ్ రావు

Ponnam Prabhakar | చరిత్రలో నిలిచిపోయేలా.. భవిష్యత్ తరాలకు అందించేలా ఉస్మానియా దవాఖాన నిర్మాణం: మంత్రి పొన్నం ప్రభాకర్






