Fire Accident | ఇండోర్‌లో దారుణం.. ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
Fire Accident | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore) నగరంలో దారుణం చోటు చేసుకుంది. బెంగాలీ స్క్వేర్ సమీపంలోని బ్రిజేశ్వరి అనెక్స్‌లో మూడంతుస్తుల భవనంలో ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకే కుటుబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు.
Fire Accident | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore) నగరంలో దారుణం చోటు చేసుకుంది. బెంగాలీ స్క్వేర్ సమీపంలోని బ్రిజేశ్వరి అనెక్స్‌లో మూడంతుస్తుల భవనంలో ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకే కుటుబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇండోర్ పోలీస్ కమిషనర్ సంతోష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో ప్రాథమికంగా ఛార్జింగ్ పాయింట్‌లో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి. క్రమేణా మంటలు పెరిగి ఇంట్లోకి వ్యాపించాయి. ఇంట్లో దాదాపు పది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉండడంతో వాటిలో కొన్ని పేలిపోయి, పరిస్థితి విషమించింది. భవనంలోని మూడంతుస్తుల్లోనూ ఉంటున్నవారు ప్రమాదం ధాటికి కరెంటు పోవడం, దాని కారణంగా ఎలక్ట్రానిక్ లాకింగ్ విధానంలో ఉన్న తలుపులు తెరుచుకోకపోవడంతో లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. వారిలో చాలామంది పొగ పీల్చి, అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఏడుగురు మృతి చెందగా, వారిని విజయ్ సేథియా (65), చోటూ సేథియా (22), సుమన్ (60), మనోజ్ పుగాలియా (65), సిమ్రాన్ (30), రాశి సేథియా (12), తిను (35)లుగా గుర్తించారు. మరో ముగ్గురు సౌరభ్ పుగాలియా (30), ఆశిష్ (30), హర్షిత్ పుగాలియా (25) తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ






