Apple Store | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?
Apple Store | హైదరాబాద్ (Hyderabad) వాసులకు గుడ్ న్యూస్.. యాపిల్ (Apple) తొలి రిటైల్ స్టోర్ వచ్చేస్తోంది. కూకట్‌పల్లిలోని వై జంక్షన్ వద్ద ఉన్న లేక్ షోర్ మాల్‌లో (Lake Shore-Y Junction Mall) యాపిల్ కూకట్‌పల్లి (Apple Kukatpally) పేరుతో స్టోర్‌ను సంస్థ ప్రారంభించనుంది.
Apple Store | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) వాసులకు గుడ్ న్యూస్.. దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) తన రిటైల్ స్టోర్‌ను నగరంలో ప్రారంభించేందుకు రెఢీ అయ్యింది. కూకట్‌పల్లిలోని వై జంక్షన్ వద్ద ఉన్న లేక్ షోర్ మాల్‌లో (Lake Shore-Y Junction Mall) యాపిల్ కూకట్‌పల్లి (Apple Kukatpally) పేరుతో స్టోర్‌ను ప్రారంభించనుంది. డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం 5:00 గంటలకు ఈ స్టోర్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఈ స్టోర్‌లో లేటెస్ట్ ఐఫోన్ (iPhone), మ్యాక్ బుక్ (MacBook), ఐప్యాడ్ (iPad), యాపిల్ వాచ్ (Apple Watch), ఎయిర్‌పాడ్స్, యాక్సెసరీలు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. యూజర్లు నేరుగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా స్పెషలిస్టులు, టెక్నికల్ నిపుణులు, బిజినెస్ కస్టమర్ల కోసం ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉంటాయి. ముత్యాల నగరంగా (City of Pearls) పేరుగాంచిన హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ముత్యాలతో కూడిన ప్రత్యేక యాపిల్ లోగో బ్యారికేడ్‌ను సంస్థ ఆవిష్కరించింది. భారత్‌లో యాపిల్ ప్రారంభించబోతున్న ఏడో రిటైల్ స్టోర్ కాగా.. తెలంగాణలో ఫస్ట్, దక్షిణ భారత దేశంలో రెండో స్టోర్ ఇదే కావడం విశేషం.
దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తోంది. ఐ-ఫోన్లు, ఇతర ఉత్పత్తులకు భారత్ బెస్ట్ మార్కెట్‌గా నిలిచిన నేపథ్యంలో ఇండియాలో తయారీ, విక్రయ కార్యకలాపాల్ని వేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో యాపిల్ తన తొలి రిటైల్ స్టోర్‌ను 2023 ఏప్రిల్‌లో ముంబై బీకేసీలో ప్రారంభించిన విషయం తెలిసిందే. భారతదేశంలో ఇదే అతిపెద్ద యాపిల్ స్టోర్. ఆ తర్వాత రెండో స్టోర్‌ను ఢిల్లీ సాకేత్‌లో ఓపెన్ చేసింది. ఈ రెండు స్టోర్ల నుంచి తొలి ఏడాదే సంస్థకు దాదాపు రూ. 800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం.
ఆ తర్వాత క్రమంగా తన స్టోర్లను యాపిల్ విస్తరిస్తూ వచ్చింది. బెంగళూరు ఫీనిక్స్ మాల్‌లో, పూణెలోని కోరెగావ్ పార్క్, నోయిడా (Noida), ముంబై బోరివలిలో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు హైదరాబాద్‌కు తన కార్యకలాపాలను విస్తరించేందుకు సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న యాపిల్ రిటైల్ స్టోర్లు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి.
Also Read..
ఫుడ్ ప్యాకెట్లపై "రెడ్" వార్నింగ్ ఉండాల్సిందే.. FSSAIకి సుప్రీం కీలక ఆదేశాలు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుతమైన ఫీచర్.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్పటికప్పుడు చెబుతుంది..
- ●Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Amala Paul | పెళ్లి తర్వాత సినిమాల్లోకి అమలాపాల్ - తల్లి పాత్రలో మలయాళ బ్యూటీ
- ●Uterus | బాలుడి కడుపులో గర్భాశయం.. పరిగిలో వెలుగు చూసిన ఘటన
- ●BM Sandip Kumar | దేశ రాజ్యాంగం కాంగ్రెస్ రాజ్యాంగం ఒక్కటే
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. 14 రోజుల ముందే మెసేజ్ షెడ్యూల్..

Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుతమైన ఫీచర్.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్పటికప్పుడు చెబుతుంది..

Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్

Amala Paul | పెళ్లి తర్వాత సినిమాల్లోకి అమలాపాల్ - తల్లి పాత్రలో మలయాళ బ్యూటీ

Uterus | బాలుడి కడుపులో గర్భాశయం.. పరిగిలో వెలుగు చూసిన ఘటన




