త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flight Tickets | విమాన ప్ర‌యాణికుల‌కు కేంద్రం భారీ ఊర‌ట‌.. సీట్ల దోపిడీకి చెక్

Flight Tickets | విమాన ప్ర‌యాణికుల‌కు (fliers) కేంద్ర ప్ర‌భుత్వం భారీ ఊర‌టనిచ్చే వార్త చెప్పింది. విమానాల్లో సీట్ల ఎంపిక పేరిట విధిస్తున్న అద‌న‌పు ఛార్జీల‌ను అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది.

D

National | Published On Mar 18, 2026, 11.42 am IST

Flight Tickets | విమాన ప్ర‌యాణికుల‌కు కేంద్రం భారీ ఊర‌ట‌.. సీట్ల దోపిడీకి చెక్
Advertisement

Flight Tickets | విమాన ప్ర‌యాణికుల‌కు (fliers) కేంద్ర ప్ర‌భుత్వం భారీ ఊర‌టనిచ్చే వార్త చెప్పింది. విమానాల్లో సీట్ల ఎంపిక పేరిట విధిస్తున్న అద‌న‌పు ఛార్జీల‌ను అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను (No Selection Fee On 60 Percent Seats) ఉచితంగా అందుబాటులో ఉంచాలని విమానయాన సంస్థలను కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది.

సీట్ల ఎంపిక పేరిట అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని, కస్టమర్లను దోచుకుంటున్నారంటూ ప్రయాణికుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది. విమానాల్లో సీట్ల ఎంపికపై విమాన‌యాన సంస్థ‌ల‌కు కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ (Union Ministry of Civil Aviation) కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలి. కేవలం మిగిలిన 40 శాతం సీట్లకు మాత్రమే (ముందు వరుసలు, ఎక్కువ లెగ్ స్పేస్ ఉన్న ప్రీమియం సీట్లు వంటివి) అదనపు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ఎయిర్‌లైన్స్‌కు వెసులుబాటు కల్పించారు.

దీంతోపాటు, ఒకే పీఎన్ఆర్‌పై ప్రయాణించే వారు సాధ్యమైనంత వరకు పక్కపక్కనే కూర్చునేలా సీట్లు కేటాయించాల‌ని ఎయిర్‌లైన్స్ సంస్థ‌ల‌ను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. విమానం ర‌ద్దు, ఆల‌స్యం వంటి సంద‌ర్భాల్లో ప్ర‌యాణికుల హ‌క్కుల‌ను కాపాడాల‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌యాణికుల హ‌క్కుల‌ను విమాన‌యాన సంస్థ‌లు త‌మ వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు, బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఎయిర్‌పోర్టు కౌంట‌ర్ల వ‌ద్ద స్ప‌ష్టంగా ప్ర‌ద‌ర్శించాల‌ని తెలిపింది. వీటిని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ప్రాంతీయ భాషల్లో ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించింది. అంతేకాదు, క్రీడా ప‌రిక‌రాలు (sports equipment), సంగీత వాయిద్యాలు (musical instruments), పెంపుడు జంతువుల (pets) ర‌వాణాకు సంబంధించి స్ప‌ష్ట‌మైన, పార‌ద‌ర్శ‌క‌మైన విధానాల‌ను అనుస‌రించాల‌ని విమాన‌యాన సంస్థ‌ల‌ను కోరింది.

నిలకడలేని నిబంధనలు, అధిక ఛార్జీలపై ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడమే ల‌క్ష్యంగా ఈ నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చిన‌ట్లు మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని విమాన‌యాన శాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ స‌హా అన్ని దేశీయ విమానయాన సంస్థలు ఈ నిబంధ‌న‌ల‌ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ఈ నిబంధనల అమలును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పర్యవేక్షిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది.

Also Read..

హ‌ర్మూజ్ స‌మీపంలోని ఇరాన్ క్షిప‌ణి స్థావ‌రాల‌పై బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబులతో విరుచుకుప‌డిన యూఎస్‌

నేను బ‌తికే ఉన్నాను.. అమెరికా రాయ‌బారితో ఇజ్రాయెల్ ప్ర‌ధాని ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌

తెలంగాణ కామ‌న్ మ్యాన్స్ లైఫ్ లైన్‌.. టీజీఎస్ ఆర్టీసీ: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Advertisement

తాజావార్తలు

Advertisement