Fire At Multi Storey Building | ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి
Fire At Multi Storey Building | ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాలం (Palam) ప్రాంతంలో ఓ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Fire At Multi Storey Building | ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాలం (Palam) ప్రాంతంలో ఓ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని బహుళ అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది (Fire At Multi Storey Building). క్షణాల్లోనే మంటల తీవ్రత పెరిగింది. ఆ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్మేసింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.
https://x.com/PTI_News/status/2034127539275502030
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళం 30 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బిల్డింగ్‌లోని నివాసితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంట్లోని ముగ్గరు పిల్లలు సహా ఏడుగురిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మరణించారు. ఇక ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి దూకి మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.
https://x.com/PTI_News/status/2034132780024844768
Also Read..
ఇండోర్‌లో దారుణం.. ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
బడ్జెట్ సమావేశాల వేళ.. అసెంబ్లీకి బాంబు బెదిరింపులు
విమాన ప్రయాణికులకు కేంద్రం భారీ ఊరట.. సీట్ల దోపిడీకి చెక్
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026

Rajdhani Express | షార్ట్ సర్క్యూట్‌తో.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



