RBI | లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. కీలక వడ్డీ రేట్లు మూడోసారీ యథాతథం
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. కీలక వడ్డీ రేట్లను (Repo Rate) మరోసారి యథాతథంగా 5.25 శాతం వద్దే ఉంచింది.
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. కీలక వడ్డీ రేట్లను (Repo Rate) మరోసారి యథాతథంగా 5.25 శాతం వద్దే ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం ఉదయం ఆర్బీఐ గరవ్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్ర (Sanjay Malhotra) మీడియాకు వెల్లడించారు. వరుసగా మూడోసారి రెపోరేటు (repo rate)లో ఎలాంటి మార్పూ లేదని ప్రకటించారు. అదేవిధంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. జీడీపీ వృద్ధి అంచనాను 69.9 నుంచి 6.6 శాతానికి తగ్గించారు.
కాగా, గతేడాది వడ్డీరేట్లను ఆర్బీఐ పలుమార్లు సవరించిన విషయం తెలిసిందే. గతేడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. ఆ తర్వాత డిసెంబర్‌లో పావు శాతం తగ్గించడంతో వడ్డీరేటు 5.25 శాతానికి చేరింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో జరిగిన సమీక్షల్లో వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు. అయితే, ఈసారి గ్లోబల్ క్రైసిస్ (US-Iran War) కారణంగా వడ్డీ రేట్లు పెరుగుతాయని అంతా భావించారు. కానీ ఆర్బీఐ మాత్రం వరుసగా మూడోసారి కూడా 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో హోల్‌లోన్స్, పర్సనల్ లోన్స్ తీసుకున్న వారికి ఊరట లభించనుంది.
Also Read..
భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..
మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 25 లక్షల మందికిపైగా భక్తులు.. హుండీ ఆదాయం ఎంతంటే?
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
- ●Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?
- ●TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్
- ●Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్
- ●Reliance Industries | ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్లు..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?

TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్






