త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు.. కేటీఆర్‌కు ఘ‌న స్వాగతం

KTR | తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల కోసం మ‌లేషియా వెళ్లిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ముఖ్య అతిథిగా కేటీఆర్ ను ఇటీవ‌ల మైటా స‌భ్యులు ఆహ్వానించ‌గా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం కౌలాలంపూర్ కు ప‌య‌న‌మై వెళ్లారు.

S

International | Published On Jun 5, 2026, 12.53 pm IST

KTR | తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు.. కేటీఆర్‌కు ఘ‌న స్వాగతం
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల కోసం మ‌లేషియా వెళ్లిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. తుంగ‌తుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాద‌రి కిశోర్ కుమార్, MYTA అధ్యక్షుడు ఎస్.తిరుపతి ఎయిర్‌పోర్టులో ఆయ‌న‌కు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు.

మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో రేపు (జూన్ 6) కౌలాలంపూర్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా కేటీఆర్ ను ఇటీవ‌ల మైటా స‌భ్యులు ఆహ్వానించ‌గా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం కౌలాలంపూర్ కు ప‌య‌న‌మై వెళ్లారు.

స్వాగ‌తం ప‌లికిన వారిలో మహిళా అధ్యక్షులు కిరణ్మయి, బీఆర్ఎస్‌ మలేషియా అధ్యక్షులు మారుతి, MYTA, BRS సభ్యులు మన్సూర్, సంతోష్, సందీప్, జ్యోతి, మౌనిక, సుప్రియ, శశి, శివ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement