త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Student Suicide | శ్రీచైత‌న్య కాలేజీ హాస్ట‌ల్‌లో ఇంట‌ర్ సెకండియ‌ర్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌.. త‌ల్లిదండ్రులు రాక‌ముందే..

Student Suicide | రంగారెడ్డి జిల్లా కొహెడ‌లో విషాదం చోటుచేసుకున్న‌ది. నాలుగు రోజుల క్రిత‌మే ఇంటి నుంచి కాలేజీకి వ‌చ్చిన యువ‌కుడు ఆత్మ‌హ‌త్య(Student Suicide) చేసుకున్నాడు.

G

Hyderabad | Published On Jun 5, 2026, 1.05 pm IST

Student Suicide | శ్రీచైత‌న్య కాలేజీ హాస్ట‌ల్‌లో ఇంట‌ర్ సెకండియ‌ర్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌.. త‌ల్లిదండ్రులు రాక‌ముందే..
Advertisement

Student Suicide | త్రినేత్ర‌.న్యూస్‌: రంగారెడ్డి జిల్లా కొహెడ‌లో విషాదం చోటుచేసుకున్న‌ది. నాలుగు రోజుల క్రిత‌మే ఇంటి నుంచి కాలేజీకి వ‌చ్చిన యువ‌కుడు ఆత్మ‌హ‌త్య(Student Suicide) చేసుకున్నాడు. హ‌నుమ‌కొండ‌కు చెందిన ఓ విద్యార్థి కొహెడ‌లోని శ్రీచైత‌న్య కాలేజీలో ఇంట‌ర్ సెకండియ‌ర్ చ‌దువుతున్నాడు. వేస‌వి సెల‌వులు ముగుస్తుండ‌టంతో నాలుగు రోజుల క్రిత‌మే త‌న నివాసం నుంచి హాస్ట‌ల్‌కు వ‌చ్చాడు. అయితే గురువారం సాయంత్రం 7 గంట‌ల‌కు త‌న గ‌దిలో కాకుండా, మ‌రో రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాడు.

అయితే ఘ‌ట‌న 7 గంట‌ల‌కు జ‌రిగితే, కాలేజీ సిబ్బంది అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు రాత్రి 10 గంట‌ల‌కు స‌మాచారం అందించారు. వారు న‌గ‌రానికి వ‌చ్చే లోపే మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించారు. దీంతో కాలేజీ యాజ‌మాన్యంపై అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చదువులో చురుకుగా ఉండే త‌మ కుమారుడు ఒక్క‌సారిగా ఉరేసుకోవడం ఏంటని తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌కు దిగాయి. కాగా, విద్యార్థి మృతితో కళాశాలలో ఉన్న మిగతా విద్యార్ధులను కళాశాల యాజమాన్యం వారి ఇండ్ల‌కు పంపిచేస్తున్నారు.

Advertisement
Advertisement