Ponnam Prabhakar | నీటిని ఆదా చేయండి.. భవిష్యత్తులో వర్షాలు రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | భవిష్యత్తులో వర్షాలు రాకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుందని, అందరూ నీటిని ఆదా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సూచించారు. బోర్లు వేస్తే నీళ్లు వచ్చే పరిస్థితులు లేవని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: భవిష్యత్తులో వర్షాలు రాకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుందని, అందరూ నీటిని ఆదా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సూచించారు. బోర్లు వేస్తే నీళ్లు వచ్చే పరిస్థితులు లేవని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదామని, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని పిలపునిచ్చారు. ఆకుపచ్చని తెలంగాణను నిర్మించి భావితరాలకు బంగారు భవిష్యత్తును అందిద్దామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 12 రోజుల పాటు అటవీ శాఖ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో తమకు సంబంధం లేదని ఎవ్వరూ అనుకోవద్దని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కను నాటాలని కోరారు. ఢిల్లీ కాలుష్యపు కోరల్లో చిక్కుకుందని, అలాంటి పరిస్థితి హైదరాబాద్‌లో రావొద్దని ప్రభుత్వం భావిస్తున్నదని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వల్ల కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు. ప్రతి ఇంట్లో చెట్లు నాటుకోవాలని కోరారు. ప్లాస్టిక్‌ను నియంత్రించాలని, భూమిలో కలిసి పోయే వ్యర్థాలను వాడితే మంచిదన్నారు.
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం
పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత.
ప్రతీ ఒక్కరం మొక్కలు నాటుదాం.
ఆకుపచ్చని తెలంగాణను నిర్మించి
భావితరాలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. pic.twitter.com/rcxnOPROr1— Ponnam Prabhakar (@Ponnam_INC) June 5, 2026
తాజావార్తలు
- ●Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ
- ●Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్
- ●Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?
- ●Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు
- ●DK Shivakumar | 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టాలి : డీకే శివకుమార్
- ●Hollywood | రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ - ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్

Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ

Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్

Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?

Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు






