Annamalai | జాతీయ పార్టీలపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
Annamalai | జాతీయ పార్టీలపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీలు (National Parties) ఎప్పుడూ తమిళనాడు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు.
Annamalai | తమిళనాడు బీజేపీ (BJP) మాజీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో జాతీయ పార్టీలపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీలు (National Parties) ఎప్పుడూ తమిళనాడు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు అర్థమయ్యే భాషను ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
జాతీయ పార్టీలపై అన్నామలై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ స్పందించారు. అన్నామలై రాజీనామా లేఖలో ప్రతి ఒక్కరూ చదవాల్సిన లైన్ ఇది అని పేర్కొన్నారు. కేసీఆర్ ఒత్తిడి లేకపోతే అటు కాంగ్రెస్ (Congress) పార్టీ కానీ, ఇటు బీజేపీ (BJP) కానీ తెలంగాణకు, రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పటికీ ప్రాధాన్యత ఇచ్చేవి కావనే విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలన్నారు. ఈ మేరకు క్రిషాంక్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు అన్నామలై రాజీనామా లేఖను జతచేసి.. జాతీయ పార్టీలపై ఆయన చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేశారు.
In Shri Annamalai's resignation letter everyone should read that one line -
"National Parties never spoke the language that people in TamilNadu understood"Hope we also understand that if not for KCR garu's force both Congress & BJP would never prioritise Telangana State and its… pic.twitter.com/Yi4gaLSevr
— Dr.Krishank (@Krishank_BRS) June 5, 2026
Also Read..
కొత్త రాజకీయ ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నా.. అన్నామలై కీలక ప్రకటన
వైద్యుల సమ్మె.. ప్రభుత్వ దవాఖానల్లో నిలిచిన ఓపీ సేవలు
వాతావరణ మార్పులను తట్టుకునే నగరాన్ని నిర్మిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
తాజావార్తలు
- ●Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ - అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!
- ●Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా
- ●Gunja Renuka | కొండా సుష్మిత.. కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటుందా..?
- ●Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే
- ●Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ - అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!

Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా

Gunja Renuka | కొండా సుష్మిత.. కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటుందా..?

Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే




