Tirumala | మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 25 లక్షల మందికిపైగా భక్తులు.. హుండీ ఆదాయం ఎంతంటే?
Tirumala | కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) వారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలనుకునే భక్తులు (Devotees) చాలామంది ఉంటారు.
Tirumala | త్రినేత్ర.న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) వారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలనుకునే భక్తులు (Devotees) చాలామంది ఉంటారు. కోరిన మొక్కులు తీర్చే ఆ శ్రీనివాసుడిని కన్నులారా వీక్షించి తరించాలని తపన పడుతుంటారు. ఏడు కొండలు ఎక్కి ఆ వెంకన్నకు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవాలని ఆశపడుతుంటారు. ఇలా మే నెలలో రికార్డు స్థాయిలో 25 లక్షల మందికిపైగా భక్తులు ఏడు కొండలవాడిని దర్శించుకున్నారు. ఇక గత నెలలో స్వామివారి ఆదయం ఎంతో తెలిస్తే అంతా నోరెళ్లబెట్టాల్సిందే!
టీటీడీ చరిత్రలో..
వేసవి సెలవులు కావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. ఒక్కోసారి స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. క్యూ కాంప్లెక్సులు అన్నీ నిండి వెలుపల కూడా భక్తులు లైన్లలో వేటి ఉంటున్నారు. ఈ క్రమంలో మే నెలలో 25,46,168 మంది భక్తులు ఆ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇది గతేడాది మేతో పోలిస్తే 2,85,308 మంది అధికమని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలో ఇది రికార్డు అని తెలిపారు. మే 24న ఒక్కరోజే అత్యధికంగా 98,058 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఇలా ఆ నెలలో భక్తుల సంఖ్య నాలుగుసార్లు 90 వేల మార్కు దాటింది.
హుండీ ఆదాయం ఎంతంటే..
రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా భారీగానే సమకూరింది. మే ఒక్క నెలలో రూ.120 కోట్లకు చేరింది. మే 3న అత్యధికంగా రూ.5.06 కోట్ల ఆదాయం హుండీ ద్వారా వచ్చింది. మరోవైపు 1.21 కోట్ల లడ్డూ విక్రయాలు జరిగాయి. అంటే తిరుమలలోని పోటు విభాగంలో రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలు తయారయ్యాయి. అదేవిధంగా 14,38,385 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా, 1.12 కోట్ల మందికి అన్న ప్రసాదాలు స్వీకరించారు. 2025 మే నెలతో పోలిస్తే ఇది 15.71 లక్షలు అధికం.
సంబంధిత వార్తలు

Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి
జూన్ 4, 2026

Tirumala Laddu Preparation | తిరుమల శ్రీవారి లడ్డూ సేల్స్ ఆల్-టైమ్ రికార్డ్: ఈ మహా ప్రసాదం అంత టేస్టీగా ఎలా ఉంటుందో తెలుసా?
జూన్ 3, 2026

Ponnala Lakshmaiah | వేద పరిరక్షణకు ముందడుగు వేసింది నేనే : పొన్నాల లక్ష్మయ్య
మే 24, 2026
తాజావార్తలు
- ●KTR | తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. కేటీఆర్కు ఘన స్వాగతం
- ●Urban Heat Island India | వేడెక్కుతున్న నగరాలు: కాంక్రీట్ అడవుల్లో కాలిపోతున్నాం.. చల్లబడే మార్గముందా?
- ●Annamalai | కొత్త రాజకీయ ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నా.. అన్నామలై కీలక ప్రకటన
- ●TGPSC | మరో 1597 పోస్టులతో నోటిఫికేషన్లు.. సిద్ధమవుతున్న టీజీపీఎస్సీ!
- ●Dasoju Sravan | స్టూడెంట్స్ డేటానే ఈజీగా లీక్ చేశారు.. రేపు క్వశ్చన్ పేపర్లు భద్రంగా ఉంటాయన్న గ్యారెంటి ఏంటి?: దాసోజు శ్రావణ్
- ●Instagram | ఇన్స్టాగ్రామ్ ప్లస్ వచ్చేసింది.. కొత్త ప్రీమియం ఫీచర్లతో యూజర్లకు అదిరే అనుభవం..

KTR | తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. కేటీఆర్కు ఘన స్వాగతం

Urban Heat Island India | వేడెక్కుతున్న నగరాలు: కాంక్రీట్ అడవుల్లో కాలిపోతున్నాం.. చల్లబడే మార్గముందా?

Annamalai | కొత్త రాజకీయ ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నా.. అన్నామలై కీలక ప్రకటన

TGPSC | మరో 1597 పోస్టులతో నోటిఫికేషన్లు.. సిద్ధమవుతున్న టీజీపీఎస్సీ!



