RBI | ఆర్బీఐ భారీగా బంగారాన్ని అమ్మేసిందంటూ బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం.. ఫ్యాక్ట్‌చెక్‌తో తిప్పి కొట్టిన కేంద్రం
RBI | ఫారెక్స్ రిజర్వ్‌లను కాపాడుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీగా బంగారాన్ని (Gold) విక్రయించినట్లుగా ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం వెలువరించింది. బ్లూమ్‌బర్గ్ నివేదికను కేంద్రం తీవ్రంగా ఖండించింది. నిజానికి గతేడాదితో పోలిస్తే విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్ రిజర్వ్స్) బంగారం వాటా భారీగా పెరిగినట్లు తెలిపింది.
RBI | పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు (foreign exchange reserves) తరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫారెక్స్ రిజర్వ్‌లను కాపాడుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీగా బంగారాన్ని (Gold) విక్రయించినట్లుగా ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం వెలువరించింది. 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని (రూ. 1.14లక్షల కోట్లు) విక్రయించినట్లు నివేదించింది. బ్లూమ్‌బర్గ్ నివేదికతో దేశ వ్యాప్తంగా ఆందోళనలను వ్యక్తమవుతున్నాయి.
అందులో నిజం లేదు..
ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రం తాజాగా స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు ఆర్బీఐ 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించినట్లు వచ్చిన నివేదికల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌తో తప్పుడు కథనాలకు చెక్ పెట్టింది. అంతేకాదు, గతేడాదితోపోలిస్తే విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్ రిజర్వ్స్) బంగారం వాటా భారీగా పెరిగినట్లు తెలిపింది.
ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా పెరిగింది..
దేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా వాస్తవానికి సెప్టెంబర్ 2025 చివరి నాటికి 13.92 శాతంగా ఉండగా.. అది ఈ ఏడాది మార్చి 31 నాటికి 16.70 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇక మే 22, 2026 నాటికి మరింత పెరిగి 16.85 శాతానికి చేరినట్లు కేంద్రం వివరించింది. మరోవైపు, ఆర్బీఐ (RBI) విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక (2025-26) ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారు నిల్వలు వాస్తవానికి పెరిగాయి. దీంతో బ్లూమ్‌బర్గ్ కథనం తప్పని తేలిపోయింది.
A news report published by @Bloomberg states that RBI may have sold gold amounting to approximately USD 12 billion.#PIBFactCheck
❌ This claim is FAKE
✔️ According to @RBI, the share of gold in India's foreign exchange reserves rose from 13.92% at end-September 2025 to 16.70%… pic.twitter.com/eVjxPxEv1i
— PIB Fact Check (@PIBFactCheck) June 3, 2026
Also Read..
ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
"మీరు కేరళలో ఉండటం మీ అదృష్టం": కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఫీజు భారీగా పెంచినా H-1B వీసాలకు తగ్గని డిమాండ్.. ఏడాదిలో 2 లక్షల దరఖాస్తులు
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!






