Ponnam Prabhakar | వాతావరణ మార్పులను తట్టుకునే నగరాన్ని నిర్మిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
Ponnam Prabhakar | భావి తరాల కోసం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, వాతావరణ మార్పులను తట్టుకొనే నగరాన్ని నిర్మిద్దామిన మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి నీళ్లు పోశారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: భావి తరాల కోసం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, వాతావరణ మార్పులను తట్టుకొనే నగరాన్ని నిర్మిద్దామిన మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఆయన మాట్లాడారు.

మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు, సుస్థిర అభివృద్ధి కోసం పాటుపడాల్సిన విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుత, భావి తరాల వాతావరణ మార్పులను తట్టుకునే నగరాన్ని నిర్మించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం ఎంతో కీలకమని చెప్పారు. మొక్కల సంరక్షణలో తమ వంతు పాత్ర నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి గోడపత్రికలు ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, జీహెచ్‌హెంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఇతర అధికారులు పాల్గొన్నారు.


తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
- ●Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?
- ●TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్
- ●Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్
- ●Reliance Industries | ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్లు..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?

TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్






