Stock Markets | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ క్రితం సెషన్ ముగింపుతో పోలిస్తే 150 పాయింట్లకు పైగా పతనమై 74,200 దిగువన ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ50 సూచీ 50 పాయింట్లకు పైగా పడిపోయి 23,350 వద్ద ట్రేడవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మానెటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుతానికి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ క్రితం సెషన్ ముగింపుతో పోలిస్తే 150 పాయింట్లకు పైగా పతనమై 74,200 దిగువన ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ50 సూచీ 50 పాయింట్లకు పైగా పడిపోయి 23,350 వద్ద ట్రేడవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మానెటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుతానికి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అయితే విదేశీ ఇన్వెస్టర్లకు గాను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, పలు ఇతర పన్ను మినహాయింపులను ప్రకటిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపినా శుక్రవారం మాత్రం మార్కెట్లు మళ్లీ పతనం వైపు కొనసాగుతున్నాయి. టోక్యో కాలమానం ప్రకారం ఉదయం 10:52 గంటలకు అమెరికా ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 0.6 శాతం మేర క్షీణించాయి. జపాన్ టోపిక్స్ 0.1 శాతం పడిపోగా, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 సూచీ 0.7 శాతం తగ్గింది. హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ 0.4 శాతం తగ్గింది. చైనా షాంఘై కంపోజిట్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లలో శుక్రవారం చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.48 శాతం పెరిగి బ్యారెల్‌కు 94 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.36 శాతం పెరిగి బ్యారెల్‌కు 91 డాలర్ల వద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ కాస్త బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 30 పైసలు లాభపడ్డ రూపాయి డాలర్ విలువకు 95.46 వద్ద ఉంది. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్‌కు కొన్ని స్వల్ప సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. అమెరికా, దక్షిణ కొరియా, తైవాన్ మార్కెట్లలో ఏఐ ట్రేడ్‌లో బలహీనత సంకేతాలు కనిపిస్తున్నాయని, టెక్ షేర్ల నుంచి ఇతర రంగాల వైపు పెట్టుబడుల మార్పు జరుగుతోందని పేర్కొన్నారు. అయితే ఇది దీర్ఘకాలిక ధోరణిగా మారుతుందో లేదో చెప్పడం ఇప్పుడే తొందరపాటవుతుందని అన్నారు. అందువల్ల కొత్త పెట్టుబడిదారులు స్టాక్స్‌ను కొనే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సంబంధిత వార్తలు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
ఆగస్టు 20, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
ఆగస్టు 20, 2026

Stock Markets | వరుసగా ఏడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ
- ●Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్
- ●Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?
- ●Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు
- ●DK Shivakumar | 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టాలి : డీకే శివకుమార్
- ●Hollywood | రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ - ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్

Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ

Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్

Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?

Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు



