EMI | రుణాల వ్యవస్థలో భారీ మార్పులు.. ఒక్క ఈఎంఐ మిస్ అయినా ఇక కష్టమే..
EMI | బ్యాంకింగ్ రంగంలో రుణాల నిర్వహణ విధానాన్ని మార్చే కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంది. 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ECL) విధానం ద్వారా బ్యాంకులు రుణాలపై భవిష్యత్తులో వచ్చే నష్టాలను ముందుగానే అంచనా వేసి, వాటికి అవసరమైన నిధులను ముందస్తుగా కేటాయించాల్సి ఉంటుంది.
EMI | బ్యాంకింగ్ రంగంలో రుణాల నిర్వహణ విధానాన్ని మార్చే కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంది. 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ECL) విధానం ద్వారా బ్యాంకులు రుణాలపై భవిష్యత్తులో వచ్చే నష్టాలను ముందుగానే అంచనా వేసి, వాటికి అవసరమైన నిధులను ముందస్తుగా కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు బ్యాంకులు వాటిల్లిన నష్టం విధానాన్ని అనుసరించేవి. అంటే రుణగ్రహీత ఈఎంఐలు చెల్లించకుండా రుణం మొండిబాకీగా మారిన తర్వాత మాత్రమే దానిని నష్టంగా పరిగణించి ప్రొవిజన్లు ఏర్పాటు చేసేవి. దీంతో సమస్య తీవ్రరూపం దాల్చిన తర్వాతే చర్యలు ప్రారంభమయ్యేవి. కొత్త ఈసీఎల్ విధానంలో మాత్రం రుణం భవిష్యత్తులో డిఫాల్ట్ అయ్యే అవకాశాలను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఏయే రుణాలపై ప్రభావం..?
ఈ మార్పు బ్యాంకులకు మాత్రమే పరిమితం కాదు. రుణాలు తీసుకున్నవారిపైనా, భవిష్యత్తులో రుణాలు తీసుకోబోయేవారిపైనా ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. బ్యాంకులు రిస్క్‌ను ముందుగానే లెక్కించాల్సి రావడంతో అదనపు నిధులను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఫలితంగా రుణాల వ్యయం పెరిగి, మార్జిన్లను కాపాడుకునేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచే అవకాశం ఉంటుంది. కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు వంటి వాటిపై ఇది ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ స్కోరును నిర్లక్ష్యం చేసే వారికి ఈ నిబంధనలు హెచ్చరికలాంటివి. రుణ ఖాతాలను బ్యాంకులు మూడు దశల్లో పర్యవేక్షించనున్నాయి. మొదటి దశలో ఆరోగ్యకరమైన ఖాతాలు, రెండో దశలో ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్న ఖాతాలు, మూడో దశలో డిఫాల్ట్ ఖాతాలు ఉంటాయి. ఒకటి లేదా రెండు ఈఎంఐలు ఆలస్యం చేసినా ఖాతా రిస్క్ కేటగిరీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకులు వెంటనే స్పందించి రుణగ్రహీతలపై మరింత నిఘా పెంచుతాయి.
ఈఎంఐలను సకాలంలో చెల్లించాలి..
దీని కారణంగా భవిష్యత్తులో రుణాలు పొందడం కొంత కఠినతరమవుతుంది. క్రెడిట్ స్కోరు పడిపోతే కొత్త రుణాల మంజూరు కూడా సులభం కాదు. అయితే దీర్ఘకాలంలో ఈ విధానం బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మందగమనం లేదా సంక్షోభ పరిస్థితుల్లో కూడా బ్యాంకులు స్థిరంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. అందుకే రుణగ్రహీతలు ఈఎంఐలను సకాలంలో చెల్లించడం, మంచి క్రెడిట్ స్కోరు కొనసాగించడం, అవసరానికి మించి రుణాలు తీసుకోకపోవడం అత్యంత కీలకం. కొత్త వ్యవస్థలో క్రెడిట్ క్రమశిక్షణే రుణాల ప్రపంచంలో విజయానికి ప్రధాన ఆయుధంగా మారనుంది.
తాజావార్తలు
- ●MP Kadiyam Kavya | వరంగల్‌లో పెండింగ్ రహదారులకు ఆమోదం తెలపండి
- ●Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు
- ●Dasoju Sravan | నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్పినం.. ఇప్పుడేమంటవ్ రేవంత్?
- ●Laurus Labs | భారీ ర్యాలీతో దూసుకెళ్తున్న ఫార్మా స్టాక్.. 5 రోజుల్లో ఏకంగా 10 శాతం లాభాలు..
- ●Kajal Aggarwal | కాజల్‌కు అచ్చిరాని బాలీవుడ్ - చందమామ ఖాతాలో మరో డిజాస్టర్
- ●Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..

MP Kadiyam Kavya | వరంగల్‌లో పెండింగ్ రహదారులకు ఆమోదం తెలపండి

Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు

Dasoju Sravan | నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్పినం.. ఇప్పుడేమంటవ్ రేవంత్?

Laurus Labs | భారీ ర్యాలీతో దూసుకెళ్తున్న ఫార్మా స్టాక్.. 5 రోజుల్లో ఏకంగా 10 శాతం లాభాలు..






