Doctors Strike | వైద్యుల సమ్మె.. ప్రభుత్వ దవాఖానల్లో నిలిచిన ఓపీ సేవలు
Doctors Strike | రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో (Government Hospitals) ఓపీ సేవలు (OP Services) నిలిచిపోయాయి. వైద్యుల బదిలీ ప్రక్రియకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం పిలుపుమేరకు డాక్టర్లు సమ్మెకు (Doctors Strike) దిగారు.
Doctors Strike | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో (Government Hospitals) ఓపీ సేవలు (OP Services) నిలిచిపోయాయి. వైద్యుల బదిలీ ప్రక్రియకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం పిలుపుమేరకు డాక్టర్లు సమ్మెకు (Doctors Strike) దిగారు. గాంధీ, ఉస్మానియా సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో ఓపీ సేవలను బహిష్కరించారు. ఓపీ, ఎలెక్టివ్ సేవలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. ఉద్యోగ బదిలీల్లో జీవో 38ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి డాక్టర్లు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
కాగా, గురువారం రాత్రి కోఠిలోని కార్యాలయంలో ప్రభుత్వ వైద్యుల సంఘం అత్యవసర భేటీ అయింది. జీవో నంబర్ 38 ప్రకారం బదిలీలు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీల్లో పూర్తి పారదర్శకత పాటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్పౌజ్ కేటగిరీ, ప్రాధాన్యతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని, గుర్తింపు సంఘ నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో 38 అమలు వరకు బదిలీ ఆప్షన్ ఫారాలు ప్రభుత్వ వైద్యుల సంఘం సమర్పించబోమన్నారు. నిబంధనలు అమలు కాకపోతే సంఘం రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని తెలిపారు. అవసరమైతే వైద్య సేవల నిలిపివేతకు కూడా సిద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యుల సంఘం వైద్యుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
- ●Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?
- ●TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్
- ●Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్
- ●Reliance Industries | ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్లు..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?

TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్






