Toll Booths | టోల్‌ప్లాజాలా వద్ద “నో క్యాష్”.. ఇకపై మొత్తం డిజిటల్ ప్రయాణమే.. ఎప్పటి నుంచంటే..?
Toll Booths | జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు కీలక అలర్ట్. టోల్ రుసుముల చెల్లింపులకు (Toll Charges) సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Toll Booths | జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికులకు కీలక అలర్ట్. టోల్ రుసుముల చెల్లింపులకు (Toll Charges) సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు ఉండవు. ఫాస్టాగ్ లేని వాహనాలకు డిజిటల్ లావాదేవీలను (Digital Payments) మాత్రమే అనుమతించనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. టోల్ ప్లాజాల వద్ద నగదు స్వీకరించే కౌంటర్లు పూర్తిగా మూసివేయనున్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. వాహనదారులు టోల్ రుసుమును కేవలం డిజిటల్ పద్ధతుల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ (FASTag) లేకపోతే, యూపీఐ (UPI) ద్వారా చెల్లించొచ్చు. అయితే, సాధారణ రుసుము కంటే 25 శాతం అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్ టోల్‌ప్లాజాల్లో దాదాపు 98 శాతం చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగదు లావాదేవీలను నిలిపివేస్తూ ఎన్‌హెచ్ఏఐ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో టోల్ ప్లాజాలా వద్ద ఇకపై ఆగాల్సిన అవసరం ఉండదు.
ఐడీ కార్డ్ మినహాయింపు విధానానికి స్వస్తి
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టోల్ మినహాయింపు కోసం తమ గుర్తింపు కార్డులను (ఐడీ కార్డులు) చూపించే విధానానికి కూడా ప్రభుత్వం స్వస్తి పలికింది. టోల్ మినహాయింపు పరిధిలోకి వచ్చే ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు ఇకపై తమ వాహనాలకు తప్పనిసరిగా 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' తీసుకోవాలి. ఈ ప్రత్యేక ఫాస్టాగ్ లేని వాహనాలు తప్పనిసరిగా టోల్ చెల్లించాల్సి ఉంటుంది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు
మరోవైపు ఫాస్టాగ్ ఇయర్ పాస్ ధరలను కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పెంచింది. ఇప్పటి వరకూ రూ.3,000గా ఉన్న ఇయర్ పాస్‌పై 2.5 శాతం మేర పెంచింది (FASTag Annual Pass Fee Hiked). ఎన్‌హెచ్ఏఐ నిర్ణయంతో ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ.3.075కు చేరింది. కొత్త ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.
Also Read..
కొలెస్ట్రాల్ టెస్టులకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొత్త మార్గదర్శకాలు
లాసెట్ దరఖాస్తు గడువు పెంపు.. 10 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లు
రైతుల భవిష్యత్ కావాల్నా.. దళారుల కమీషన్ కావాల్నా?: హరీశ్‌రావు
సంబంధిత వార్తలు

India UPI System | “రోడ్డు పక్కన చాయ్ కొట్టు దగ్గర కూడా అదేనా?”.. భారత్ డిజిటల్ విప్లవానికి యూరప్ పర్యాటకురాలు ఫిదా
జూన్ 17, 2026

Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?
జూన్ 9, 2026

UPI transactions | మే నెలలో రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి
- ●Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
- ●EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని
- ●HMWSSB | గోదావరి పైపులైన్‌కు లీకేజీ.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
- ●Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..

Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి

Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!

EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని



