LAWCET | లాసెట్ దరఖాస్తు గడువు పెంపు.. 10 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లు
LAWCET | న్యాయవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ లా సెట్ (TG LAWCET), పీజీఎల్‌సెట్ (TG PGLCET) దరఖాస్తుల గడువును ఉన్నత విద్యా మండలి (TGCHE) పొండిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
LAWCET | త్రినేత్ర.న్యూస్: న్యాయవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ లా సెట్ (TG LAWCET), పీజీఎల్‌సెట్ (TG PGLCET) దరఖాస్తుల గడువును ఉన్నత విద్యా మండలి (TGCHE) పొండిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ గడువు ఏప్రిల్ 1తో ముగిసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మూడేండ్లు, ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులతో పాటు, రెండేండ్ల ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ మేరకు అవకాశం కల్పించినట్లు టీజీసీహెచ్ఈ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మే 18న రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు.
మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రవేశపరీక్ష ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలలో నిర్వహిస్తారు. పీజీఎల్‌సెట్ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
దరఖాస్తు రుసుము..
- లా సెట్‌కు రూ.900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600
- పీజీఎల్‌సెట్‌కు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.900
- రూ.500 నుంచి 10,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 13 వరకు
వెబ్‌సైట్: https://lawcet.tgche.ac.in/
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడతలో కౌన్సెలింగ్
- ●GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత
- ●Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!
- ●Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు
- ●సుస్మిత పొలిటికల్ ఎంట్రీ: కొండా మురళి 'ప్లాన్-బి' వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?
- ●Horoscope | ఆగస్టు 27 రాశిఫలాలు.. ఈ రాశి వారు సవాళ్లను సులభంగా అధిగమిస్తారు!

TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడతలో కౌన్సెలింగ్

GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత

Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!

Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు





