Cholesterol Tests | కొలెస్ట్రాల్ టెస్టులకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొత్త మార్గదర్శకాలు
Cholesterol Tests | అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA), అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (ACC) కలిసి డిస్లిపిడీమియా నిర్వహణపై 2026 మార్గదర్శకాలను విడుదల చేశాయి. 2018లో విడుదలైన కొలెస్ట్రాల్ మార్గదర్శకాల తర్వాత ఇది మొదటి పెద్ద మార్పు కావడం విశేషం. ఈ మార్గదర్శకాలు LDL (చెడు కొలెస్ట్రాల్), ట్రైగ్లిసరైడ్స్ వంటి డిస్లిపిడీమియాలపై దృష్టి సారించాయి.
Cholesterol Tests | అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA), అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (ACC) కలిసి డిస్లిపిడీమియా నిర్వహణపై 2026 మార్గదర్శకాలను విడుదల చేశాయి. 2018లో విడుదలైన కొలెస్ట్రాల్ మార్గదర్శకాల తర్వాత ఇది మొదటి పెద్ద మార్పు కావడం విశేషం. ఈ మార్గదర్శకాలు LDL (చెడు కొలెస్ట్రాల్), ట్రైగ్లిసరైడ్స్ వంటి డిస్లిపిడీమియాలపై దృష్టి సారించాయి. ఈ మార్పును సర్క్యులేషన్, జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో సంయుక్తంగా ప్రచురించారు. తాజా మార్గదర్శకాలను 2026 గైడ్‌లైన్ ఆన్ ది మేనేజ్‌మెంట్ ఆఫ్ డిస్లిపిడీమియాగా నామకరణం చేసి, 2024 చివరి వరకు అందుబాటులో ఉన్న ఆధారాలను ఇందులో చేర్చారు. యువతలో పెరుగుతున్న గుండె జబ్బులను తగ్గించడానికి ముందస్తు స్క్రీనింగ్, వ్యక్తిగతంగా అందించే చికిత్స ద్వారా జీవితకాల గుండె సంబంధిత ప్రమాదాలను తగ్గించడంపై ఇవి ప్రధానంగా దృష్టి పెట్టాయి.
గుండె జబ్బుల్లో చెడు కొలెస్ట్రాల్ దే కీలక పాత్ర..
మార్గదర్శక రచనా కమిటీ చైర్మన్, బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్కిన్స్ సిక్కరోన్ సెంటర్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ డైరెక్టర్ డా. రోజర్ బ్లూమెన్తాల్ మాట్లాడుతూ కార్డియోవాస్క్యులర్ వ్యాధులలో 80 శాతం కంటే ఎక్కువ రోగాలను నివారించవచ్చని తెలిపారు. అధిక LDL కొలెస్ట్రాల్, అంటే చెడుకొలెస్ట్రాల్ ఈ ప్రమాదంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని మెరుగుపరచడం మొదటి అడుగు అని, కానీ లిపిడ్ స్థాయిలు అనుకున్న స్థాయిలలోకి రాకపోతే 10 సంవత్సరాల క్రితం కంటే ముందుగానే లిపిడ్ లెవల్స్‌ను తగ్గించే ఔషధాలను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. దీర్ఘకాలం తక్కువ LDL స్థాయిలను కొనసాగించడం, తక్కువ రక్తపోటు భవిష్యత్ హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయని తెలిపారు.
ప్రమాదాన్ని గుర్తించేందుకు నూతన సాధనం..
పాత రిస్క్ స్కోర్లు, ముఖ్యంగా పూల్డ్ కోహరెంట్ ఈక్వెషన్స్ హార్ట్ అటాక్, స్ట్రోక్‌కు సంబంధించిన 10 సంవత్సరాల ప్రమాదాన్ని 40 -50 శాతం వరకు అధికంగా అంచనా వేసేవి. కొత్త మార్గదర్శకాలు ఇప్పుడు ఆ పద్ధతిని వదిలి AHA PREVENT-ASCVD రిస్క్ కాలిక్యులేటర్‌ను ఉపయోగిస్తున్నాయి. ఈ సాధనం అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ (ASCVD)కు సంబంధించిన 10, 30 సంవత్సరాల ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. ఇది చికిత్స నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది. స్టాటిన్ చికిత్స ప్రారంభించాలా లేదా ఎంత తీవ్రతతో లిపిడ్ తగ్గించే చికిత్స ఇవ్వాలన్న విషయాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బ్లూమెన్తాల్ మాట్లాడుతూ ఈ కొత్త అంచనా పద్ధతితో వార్షిక ఆరోగ్య పరీక్షలలో పొందిన సమాచారాన్ని కొలెస్ట్రాల్, రక్తపోటు, వయస్సు, జీవనశైలి ఉపయోగించి మరింత కచ్చితంగా గుండె ప్రమాదాన్ని అంచనా వేయవచ్చని తెలిపారు. అదనంగా రిస్క్ ఎన్‌హాన్సర్స్ ద్వారా వ్యక్తిగత స్థాయిలో మరింత స్పష్టత పొందవచ్చని తెలిపారు.
ఈ సూచనలను తప్పనిసరిగా పాటించాలి..
LDL లేదా HDL (మంచి కొలెస్ట్రాల్) స్థాయిలు సరిగా ఉన్నాయని అలోన్ అనుకోవడం సరిపోదని బ్లూమెన్తాల్ అన్నారు. ఇతర బయోమార్కర్లను కొలవడం ద్వారా గుండె ప్రమాదంపై పూర్తి చిత్రం పొందవచ్చని, ఇది త్వరగా లేదా తీవ్రమైన చికిత్స అవసరమా అనే నిర్ణయానికి సహాయపడుతుందని తెలిపారు. ఈ సందర్బంగా బ్లూమెన్తాల్ యువతకు పలు సూచనలు చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అత్యంత ముఖ్యమైనదని, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, తక్కువ కొవ్వు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని, చక్కెర, ప్రాసెస్ చేసిన కొవ్వులు, సోడియం తగ్గించాలని, వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం చేయాలని సూచించారు. ట్రైగ్లిసరైడ్స్ 150 mg/dL కంటే ఎక్కువైతే స్థూలకాయం లేదా మద్యం వంటి మూల కారణాలను పరిష్కరించాలని, 500 mg/dL కంటే ఎక్కువైతే ప్యాంక్రియాటిటిస్ నివారణ కోసం ఫైబ్రేట్స్ లేదా ఒమెగా-3లను ఉపయోగించాలని అన్నారు. చిన్న వయస్సులోనే LDL, ట్రైగ్లిసరైడ్స్ తక్కువగా ఉంటే తరువాత గుండె వ్యాధుల ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే జీవిత ప్రారంభ దశలోనే చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heart Check Up | 35 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా హార్ట్ చెకప్ చేయించుకోవాలి.. కార్డియాలజిస్టు సూచన..
జులై 11, 2026

Mobile snatching | విషాదంగా ముగిసిన దొంగతనం.. ఫోన్ కొట్టేసి పారిపోతుండగా గుండెపోటు..
జూన్ 20, 2026

Heart Attack | విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు గుండెపోటు.. టిఫిన్ కోసం వెళ్తుండగా ఘటన
జూన్ 14, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!
- ●Bollywood | మైనర్‌కు వేధింపులు - ప్రముఖ నటుడిపై పోక్సో కేసు
- ●Shabad on fire | భగ్గుమన్న షాబాద్.. పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు
- ●Yadagirigutta Temple Board | కొలువుదీరిన యాదగిరిగుట్ట కొత్త బోర్డు
- ●Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ - ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?

CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి

Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!

Bollywood | మైనర్‌కు వేధింపులు - ప్రముఖ నటుడిపై పోక్సో కేసు

Shabad on fire | భగ్గుమన్న షాబాద్.. పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు



