Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
ఫిఫా వరల్డ్ కప్ 2026లో స్పెయిన్ సత్తా చాటింది. క్వార్టర్ ఫైనల్లో 2-1 తేడాతో బెల్జియంను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. జూలై 15న ఫ్రాన్స్‌తో తలపడనుంది.
సంక్షిప్త సారాంశం
ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్స్‌లో బెల్జియంపై 2-1 తేడాతో స్పెయిన్ అద్భుత విజయం సాధించింది. స్పెయిన్ తరఫున ఫాబియన్ రూయిజ్, మైకేల్ మెరినో గోల్స్ చేయగా.. లామినే యమాల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. బెల్జియం స్టార్ గోల్ కీపర్ కోర్టోయిస్ గాయంతో మైదానం వీడటం ఆ జట్టు కొంపముంచింది. జూలై 15న డల్లాస్ వేదికగా జరగనున్న సెమీ-ఫైనల్లో పటిష్టమైన ఫ్రాన్స్‌తో స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనుంది.
- సెమీస్‌లోకి స్పెయిన్
- క్వార్టర్ ఫైనల్లో బెల్జియంపై 2-1 తేడాతో విజయం
- సెమీఫైనల్‌లో ఫ్రాన్స్‌తో పోరు
Spain vs Belgium | త్రినేత్ర.న్యూస్ : ఫిఫా ప్రపంచకప్ 2026 పోరులో భాగంగా శనివారం జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు 2-1 తేడాతో బెల్జియంను మట్టకరిపించి, సగర్వంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ నెల 15న డల్లాస్ స్టేడియంలో జరుగనున్న సెమీస్‌లో ఫ్రాన్స్‌తో తలపడనుంది. స్పెయిన్ తరపున 30వ నిమిషంలో ఫాబియన్ రూయిజ్ తొలి గోల్ నమోదు చేయగా, మైకేల్ మెరినో 88వ నిమిషంలో మరో గోల్ చేశాడు. బెల్జియం తరపున చార్లెస్ కెటలార్ 41వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. ఈ టోర్నీలో స్పెయిన్‌పై ఇదే తొలి గోల్ కావడం విశేషం. స్పెయిన్ రెండు గోల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన లామినే యమాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు.

మ్యాచ్ ఆరంభం నుంచి స్పెయిన్ దూకుడు కనపరిచింది. మ్యాచ్ మొత్తంలో 16 సార్లు బెల్జియం గోల్ పోస్ట్‌పై దాడులు చేసి, తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఎక్కువ సమయం బంతిని తన ఆధీనంలోనే ఉంచుకుంది. స్పెయిన్ తరపున 30వ నిమిషంలో రూయిజ్ గోల్ సాధించగా, మొదటి అర్థభాగానికి కొద్ది ముందు 41వ నిమిషంలో బెల్జియం తరపున కెటలార్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఆ తరువాత స్పెయిన్ దాడులను బెల్జియం గోల్ కీపర్ కోర్టోయిస్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. కానీ 70వ నిమిషంలో గాయపడిన కోర్టోయిస్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో సెన్నే లామెన్స్ గోల్‌కీపర్‌గా బరిలోకి దిగాడు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ బరిలోకి దిగకపోవడం లామెన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. స్పెయిన్ ప్లేయర్ పావ్ కుబార్సి దూరం నుంచి కొట్టిన బంతిని లామెన్స్ సరిగా ఆపలేకపోయాడు. తిరిగి అదే బంతిని మైకేల్ మెరినో గోల్‌పోస్ట్‌లోకి పంపించి స్పెయిన్‌కు విజయం ఖాయం చేశాడు.

వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీల్లో సెమీస్ చేరిన జట్టుగా నిలిచిన ఫ్రాన్స్‌తో స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనుంది. స్పెయిన్ చివరిసారిగా 2010లో సెమీస్ చేరి, అదే ఏడాది కప్పు ఎగరేసుకుపోయింది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని
- ●HMWSSB | గోదావరి పైపులైన్‌కు లీకేజీ.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
- ●Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..
- ●Ashwini Vaishnaw | బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్ : అశ్వినీ వైష్ణవ్
- ●Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచండి

EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని

HMWSSB | గోదావరి పైపులైన్‌కు లీకేజీ.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..






