EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
EPFO | ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గత వారం నిర్వహించిన షెడ్యూల్ మెయింటెనెన్స్ పనులు పూర్తి చేసిన తర్వాత తన పాస్‌బుక్ పోర్టల్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సభ్యులు మరోసారి తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం పొందారు.
EPFO | ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గత వారం నిర్వహించిన షెడ్యూల్ మెయింటెనెన్స్ పనులు పూర్తి చేసిన తర్వాత తన పాస్‌బుక్ పోర్టల్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సభ్యులు మరోసారి తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం పొందారు. జూన్ చివరి నుంచి ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. భారీ స్థాయిలో డేటాబేస్ కన్సాలిడేషన్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కార్యక్రమాల కోసం ఈ చర్య చేపట్టింది. ప్రస్తుతం సభ్యులు మళ్లీ పోర్టల్‌లో లాగిన్ అయి తమ ఖాతా వివరాలను చూడవచ్చు. అయితే, ఇటీవల ప్రాసెస్ చేసిన అకౌంటింగ్ సంవత్సరాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని పోర్టల్‌లో నోటీసు కనిపిస్తోంది.
లేటెస్ట్ సమాచారం మాత్రమే అందుబాటులో..
ఈపీఎఫ్‌వో నోటీసు ప్రకారం, ఇటీవల ప్రాసెస్ చేసిన అకౌంటింగ్ సంవత్సరాలకు సంబంధించిన లావాదేవీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు అకౌంటింగ్ సంవత్సరాలకు సంబంధించిన వివరాలను కొత్త వ్యవస్థకు మైగ్రేట్ చేస్తున్నామని, అవి కూడా మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ ప్రక్రియ కావడంతో సభ్యులు ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మైగ్రేషన్ ప్రక్రియ జూన్ 26న ప్రారంభమైంది. దీని ప్రధాన లక్ష్యం ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం, భద్రతను మరింత బలోపేతం చేయడం, అలాగే ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవల విశ్వసనీయతను మెరుగుపరచడం. సభ్యులకు, యజమానులకు సంబంధించిన చాలా సేవలను దశలవారీగా పునరుద్ధరించినప్పటికీ, అదనపు వెరిఫికేషన్, వాలిడేషన్ ప్రక్రియలు కొనసాగుతున్నందున పీఎఫ్ క్లెయిమ్‌లు, ఇతర సేవల అభ్యర్థనల ప్రాసెసింగ్‌లో మరో రెండు వారాల వరకు కొంత ఆలస్యం ఉండే అవకాశం ఉందని ఈపీఎఫ్‌వో తెలిపింది.
యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియలో మార్పులు..
కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వార్షిక వడ్డీని జూలై 15 నుంచి సభ్యుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించే అవకాశం ఉంది. పాస్‌బుక్ పోర్టల్ పునరుద్ధరణ ఈ వడ్డీ జమ ప్రక్రియకు ముందే పూర్తయింది. ఇటీవలే ఈపీఎఫ్‌వో అప్‌గ్రేడ్ చేసిన యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ను కూడా దశలవారీగా ప్రారంభించింది. కొత్త సాంకేతికతతో భద్రత, సిస్టమ్ స్థిరత్వం, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ అప్‌గ్రేడ్ లక్ష్యంగా పేర్కొంది. ఇక యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) యాక్టివేషన్ విధానంలో కూడా మార్పులు చేసింది. ఇకపై యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ద్వారా యూఏఎన్ యాక్టివేట్ చేసే అవకాశం ఉండదు. సభ్యులు తప్పనిసరిగా ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఏటీ) ఉపయోగించి యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.
పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేయండి..
పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకోవాలనుకునే సభ్యులు అధికారిక ఈపీఎఫ్‌వో మెంబర్ పాస్‌బుక్ పోర్టల్‌లో లాగిన్ అయి వివరాలు చూడవచ్చు. అలాగే ఉమాంగ్ యాప్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. మరో ప్రత్యామ్నాయంగా, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇచ్చినా పీఎఫ్ ఖాతా వివరాలు తెలుసుకునే సౌకర్యం ఉంది. ఈపీఎఫ్ ఈ-పాస్‌బుక్ చూడాలంటే ముందుగా ఈపీఎఫ్‌వో మెంబర్ పాస్‌బుక్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. డ్యాష్‌బోర్డ్‌లో కుడివైపు కనిపించే ఈ-పాస్‌బుక్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఆన్‌లైన్ పాస్‌బుక్ పేజీకి వెళ్లిన తర్వాత యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి సైన్-ఇన్ చేసిన తర్వాత పీఎఫ్ పాస్‌బుక్‌ను వీక్షించవచ్చు. అవసరమైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
తాజావార్తలు
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని
- ●HMWSSB | గోదావరి పైపులైన్‌కు లీకేజీ.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
- ●Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..
- ●Ashwini Vaishnaw | బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్ : అశ్వినీ వైష్ణవ్
- ●Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచండి
- ●Vietnam Boat Capsize | వియత్నాంలో ఘోర విషాదం: స్పీడ్‌బోట్ బోల్తా.. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకుల మృతి

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని

HMWSSB | గోదావరి పైపులైన్‌కు లీకేజీ.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..

Ashwini Vaishnaw | బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్ : అశ్వినీ వైష్ణవ్






