త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anesthesia | పెద‌వి గాయానికి చికిత్స‌.. మ‌త్తు ఇంజ‌క్ష‌న్ కార‌ణంగా 18 నెల‌ల చిన్నారి మృతి

Anesthesia | కేర‌ళ (Kerala)లో తీవ్ర‌ విషాదం చోటు చేసుకుంది. పెద‌వికి అయిన చిన్న గాయానికి చికిత్స కోసం మ‌త్తు ఇంజ‌క్ష‌న్ (Anesthesia) ఇవ్వ‌డంతో 18 నెల‌ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

D

National | Published On Jul 11, 2026, 5.12 pm IST

Anesthesia | పెద‌వి గాయానికి చికిత్స‌.. మ‌త్తు ఇంజ‌క్ష‌న్ కార‌ణంగా 18 నెల‌ల చిన్నారి మృతి
Advertisement

Anesthesia | కేర‌ళ (Kerala)లో తీవ్ర‌ విషాదం చోటు చేసుకుంది. అనస్థీషియా (Anesthesia) విక‌టించి ఏడాదిన్న‌ర బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న క‌న్నూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిన్నారి మృతికి వైద్యుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

క‌న్నూరు (Kannur) జిల్లాకు చెందిన సూర‌జ్‌, విజిష దంప‌తుల ఏకైక కుమారుడు 18 నెల‌ల దేవాన్ష్ సౌర్య ఈనెల 5న ఇంటి ముందు ఆడుకుంటూ కింద‌ప‌డిపోయాడు. దీంతో చిన్నారి పెద‌వికి గాయ‌మైంది. అప్ర‌మ‌త్త‌మైన త‌ల్లిదండ్రులు బాలుడిని పయ్యన్నూర్ (Payyannur)లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రికి (Baby Memorial Hospital) తరలించారు. చిన్నారిని ప‌రీక్షించిన వైద్యులు గాయ‌మైన పెద‌వికి కుట్లు వేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో నొప్పి రాకుండా అన‌స్థీషియా (మ‌త్తు ఇంజ‌క్ష‌న్‌) ఇచ్చారు. ఆ త‌ర్వాత చిన్నారి ఆరోగ్యం మ‌రింత క్షీణించింది.

అన‌స్థీషియా ఇచ్చిన కొద్దిసేపటికే బాబు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అప్ర‌మ‌త్తమైన వైద్యులు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కన్నూరులోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. అక్క‌డ ఐదు రోజుల‌పాటూ ప్రాణాల‌తో పోరాడిన దేవాన్ష్ శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ప‌రిస్థితి విష‌మించి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మ‌ర‌ణ వార్త తెలిసి ఆ త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు. వైద్యుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే త‌మ కుమారుడు మ‌ర‌ణించిన‌ట్లు ఆరోపించారు. ఈ మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేర‌కు ప‌య్య‌న్నూరు పోలీసులు బాలుడికి అన‌స్థీషియా ఇచ్చిన వైద్యురాలు అంజ‌లిపై కేసు న‌మోదు చేశారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై స‌ద‌రు ఆసుప‌త్రి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే చిన్నారికి వైద్యం అందించిన‌ట్లు తెలిపింది. ఈ కేసు ద‌ర్యాప్తులో అధికారుల‌కు తాము పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని వెల్లడించింది. చిన్నారి మృతి స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

Also Read..

బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా హైదరాబాద్‌ : అశ్వినీ వైష్ణ‌వ్

భార‌త్ ఒలింపిక్‌ బిడ్‌కు ఆస్ట్రేలియా మ‌ద్ద‌తు

16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్‌!

Advertisement
Advertisement