త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMWSSB | గోదావ‌రి పైపులైన్‌కు లీకేజీ.. హైద‌రాబాద్‌లో ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రా బంద్

HMWSSB | హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరందించే గోదావ‌రి పైపులైన్‌కు లీకేజీ ఏర్ప‌డింది. దీంతో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది.

S

Hyderabad | Published On Jul 11, 2026, 4.46 pm IST

HMWSSB | గోదావ‌రి పైపులైన్‌కు లీకేజీ.. హైద‌రాబాద్‌లో ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రా బంద్
Advertisement

HMWSSB | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరందించే గోదావ‌రి పైపులైన్‌కు లీకేజీ ఏర్ప‌డింది. దీంతో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. లింగంప‌ల్లి నుంచి బంజారాహిల్స్‌కు వెళ్లే పైపులైన్‌కు లీకేజీ ఏర్ప‌డింద‌ని, మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టిన‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు తెలిపారు.

ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్సార్ న‌గ‌ర్, అమీర్‌పేట్, వెంగ‌ళ్రావు న‌గ‌ర్, ఎల్లారెడ్డిగూడ‌, స‌న‌త్‌న‌గ‌ర్‌, నిమ్స్, బంజారాహిల్స్‌, వెంక‌ట‌గిరి, బీఎస్ మ‌క్తా, ఎంఎస్ మ‌క్తా, సోమాజిగూడ‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో మంచి నీళ్ల స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది.

ఈ లీకేజీపై జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి స‌మీక్షించారు. నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగిన ప్ర‌దేశాల్లో వాట‌ర్ ట్యాంక‌ర్‌తో ప్ర‌జ‌ల‌కు నీటిని అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. వీలైనంత త్వ‌ర‌గా మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి నీటి స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రించాల‌న్నారు. వినియోగ‌దారులు కూడా నీటిని వృథాగా ఖ‌ర్చు చేయ‌కుండా, అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు వాడుకోవాల‌ని అశోక్ రెడ్డి సూచించారు.

Advertisement
Advertisement