Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ – నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ – ప్రొడ్యూసర్‌గా హీరో నాని
తమ్ముడు డిజాస్టర్ తర్వాత సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న నితిన్ వరుసగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. దండోరా ఫేమ్ మురళీ కాంత్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి హీరో నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Rukmini Vasanth | టాలీవుడ్‌లో మరో కొత్త కాంబినేషన్ సెట్టయ్యింది. హీరోలు నాని, నితిన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో వీరిద్దరు హీరోలుగా నటించడం లేదు. ఒకరు హీరోగా నటిస్తే మరొకరు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నారు.
ప్రొడ్యూసర్‌గా...
గత ఏడాది రిలీజైన తమ్ముడుతో వరుసగా తొమ్మిది డిజాస్టర్ నితిన్ ఖాతాలో చేరింది. ఈ పరాజయాలతో ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నితిన్ ఇటీవలే మూడు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో ఓ సినిమాకు నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నాడు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ మూవీకి దండోరా ఫేమ్ మురళీ కాంత్ దర్శకత్వం వహించనున్నాడు.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్...
దండోరా తరహాలోనే మెసేజ్ ఓరియెంటెడ్ లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుందని అంటున్నారు. ఇందులో హీరోయిన్ కూడా ఫైనల్ అయినట్లు టాక్. నితిన్‌కు జోడీగా కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ నటించబోతుంది. ఇందులో గ్లామర్ హంగులకు దూరంగా కొత్త కోణంలో రుక్మిణి పాత్ర సాగుతుందని సమాచారం. త్వరలోనే నితిన్, నాని మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్...
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నితిన్ చేస్తోన్న ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ఇటీవలే లాంఛ్ అయ్యింది. సోము - నర్రి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అలాగే ఆయ్ ఫేమ్ అంజి శ్రీను దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడు. స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్‌లో ఈ సినిమా రూపొందనుంది.
టాక్సిక్.. డ్రాగన్...
తెలుగులో ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమా చేస్తోంది రుక్మిణి వసంత్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. యశ్ టాక్సిక్‌లో ఓ హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటించింది. ఆగస్ట్ 26న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ – ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?
జులై 11, 2026

Bhagyashri Borse | లెనిన్ సక్సెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే – హైదరాబాద్ నా కర్మభూమి అంటూ కామెంట్స్
జులై 11, 2026

Ntr Vs Dhanush | ఎన్టీఆర్‌కు ధనుష్ కౌంటర్ – గాడ్ ఆఫ్ వార్‌కు పోటీగా మైథాలజీ మూవీ అనౌన్స్ – ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్
జులై 11, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!
- ●Bollywood | మైనర్‌కు వేధింపులు - ప్రముఖ నటుడిపై పోక్సో కేసు
- ●Shabad on fire | భగ్గుమన్న షాబాద్.. పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు
- ●Yadagirigutta Temple Board | కొలువుదీరిన యాదగిరిగుట్ట కొత్త బోర్డు
- ●Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ - ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?

CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి

Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!

Bollywood | మైనర్‌కు వేధింపులు - ప్రముఖ నటుడిపై పోక్సో కేసు

Shabad on fire | భగ్గుమన్న షాబాద్.. పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు



