Gold ETF | యుద్ధం ప్రభావం ఉన్నా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు తగ్గని ఆదరణ.. భారీగా పెరుగుతున్న పెట్టుబడులు..
Gold ETF | అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలతోపాటు మధ్య ప్రాచ్యంలో పెరిగిన భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో పెట్టుబడిదారులు ఆందోళనలో ఉన్నప్పటికీ గోల్డ్ ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో మాత్రం పెట్టుబడులు భారీగానే పెరుగుతున్నాయి.
Gold ETF | అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలతోపాటు మధ్య ప్రాచ్యంలో పెరిగిన భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో పెట్టుబడిదారులు ఆందోళనలో ఉన్నప్పటికీ గోల్డ్ ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో మాత్రం పెట్టుబడులు భారీగానే పెరుగుతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ.3,443 కోట్ల నికర పెట్టుబడులు నమోదయ్యాయి. మే నెలలో నమోదైన రూ.725 కోట్ల నికర ఉపసంహరణతో పోలిస్తే ఇది 570 శాతానికి పైగా పెరుగుదల కావడం విశేషం. గోల్డ్ ఈటీఎఫ్ అంటే బంగారం ధరను అనుసరించే కమోడిటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్. ఇందులో ప్రతి యూనిట్ సాధారణంగా 99.5 శాతం స్వచ్ఛత కలిగిన ఒక గ్రాము భౌతిక బంగారాన్ని సూచిస్తుంది. ఈ బంగారాన్ని ఫండ్ హౌస్ భద్రంగా నిల్వ ఉంచుతుంది. ఈ యూనిట్లను సాధారణ షేర్ల మాదిరిగానే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో కొనుగోలు, విక్రయాలు చేయవచ్చు.
తగ్గిన ఏయూఎమ్..
అయితే గోల్డ్ ఈటీఎఫ్‌ల సగటు అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎమ్) జూన్ 6లో రూ.1,76,483.59 కోట్లుగా నమోదైంది. మే నెలలో ఇది రూ.1,83,621.79 కోట్లుగా ఉండగా, జూన్‌లో స్వల్పంగా తగ్గింది. ఇక యాక్టివ్‌గా నిర్వహించే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో జూన్ నెలలో నికర పెట్టుబడులు రూ.28,973.41 కోట్లకు చేరాయి. మేలో ఇవి రూ.22,907.77 కోట్లుగా నమోదయ్యాయి. 2026లో ఇప్పటివరకు అత్యల్ప ఈక్విటీ ఇన్‌ఫ్లోలు మే నెలలోనే నమోదయ్యాయి. మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ జూన్‌లో రూ.52,948.78 కోట్ల నికర ఉపసంహరణను నమోదు చేసింది. మే నెలలో నమోదైన రూ.64,021.17 కోట్ల ఉపసంహరణతో పోలిస్తే ఈ స్థాయి తగ్గింది. ఈక్విటీ విభాగాల్లో లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో జూన్‌లో రూ.2,067.48 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మేలో ఇవి రూ.1,592.93 కోట్లుగా ఉన్నాయి. మిడ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్‌ఫ్లోలు రూ.4,385.06 కోట్ల నుంచి రూ.6,090.17 కోట్లకు పెరిగాయి. అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు మేలోని రూ.6,263.56 కోట్ల నుంచి జూన్‌లో రూ.5,601.96 కోట్లకు తగ్గాయి.
అన్ని విభాగాల్లోనూ పెరుగుతున్న పెట్టుబడులు..
ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ జూన్‌లో రూ.5,231.31 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా, మేలో ఇవి రూ.4,945.57 కోట్లుగా ఉన్నాయి. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్స్‌లో కూడా పెట్టుబడులు పెరిగి రూ.647.87 కోట్ల నుంచి రూ.1,469.26 కోట్లకు చేరాయి. డెట్ ఫండ్స్‌లో మాత్రం జూన్‌లో రూ.1.09 లక్షల కోట్ల నికర ఉపసంహరణ నమోదైంది. మే నెలలో ఈ విభాగంలో రూ.96,948.51 కోట్ల ఉపసంహరణ జరిగింది. ఓవర్‌నైట్ ఫండ్స్‌లో ఉపసంహరణలు మేలోని రూ.15,524 కోట్ల నుంచి జూన్‌లో రూ.10,579.58 కోట్లకు తగ్గాయి. మరోవైపు లిక్విడ్ ఫండ్స్‌లో ఉపసంహరణలు రూ.29,680.94 కోట్ల నుంచి రూ.42,293.29 కోట్లకు పెరిగాయి. హైబ్రిడ్ స్కీమ్స్‌లో జూన్‌లో రూ.12,892.76 కోట్ల నికర పెట్టుబడులు నమోదయ్యాయి. అయితే మేలో ఇవి రూ.16,538.47 కోట్లుగా ఉండటంతో ఈ విభాగంలో ఇన్‌ఫ్లోలు తగ్గాయి. ఆర్బిట్రాజ్ ఫండ్స్‌లో జూన్ నెలలో రూ.5,799 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మే నెలలో ఈ విభాగంలో రూ.5,697.90 కోట్ల నికర ఇన్‌ఫ్లోలు నమోదయ్యాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని
- ●HMWSSB | గోదావరి పైపులైన్‌కు లీకేజీ.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
- ●Ashwini Vaishnaw | బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్ : అశ్వినీ వైష్ణవ్
- ●Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచండి
- ●Vietnam Boat Capsize | వియత్నాంలో ఘోర విషాదం: స్పీడ్‌బోట్ బోల్తా.. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకుల మృతి

EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని

HMWSSB | గోదావరి పైపులైన్‌కు లీకేజీ.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

Ashwini Vaishnaw | బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్ : అశ్వినీ వైష్ణవ్






