త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta Layoffs | మెటాలో 8 వేల మందికి లేఆఫ్స్‌..!

Meta Layoffs | మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నేతృత్వంలోని అమెరికాకు చెందిన టెక్ దిగ్గ‌జం మెటా భారీగా ఉద్యోగాల కోత‌కు (Meta Layoffs) సిద్ధ‌మైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న వ‌ర్క్‌ఫోర్స్‌ (workforce)లో 10 శాతం మందిని తొల‌గించాల‌ని యోచిస్తోంది.

D

Business | Published On Apr 18, 2026, 11.31 am IST

Meta Layoffs | మెటాలో 8 వేల మందికి లేఆఫ్స్‌..!
Advertisement

Meta Layoffs | మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నేతృత్వంలోని అమెరికాకు చెందిన టెక్ దిగ్గ‌జం మెటా భారీగా ఉద్యోగాల కోత‌కు (Meta Layoffs) సిద్ధ‌మైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న వ‌ర్క్‌ఫోర్స్‌ (workforce)లో 10 శాతం మందిని తొల‌గించాల‌ని యోచిస్తోంది. అంటే సుమారు 8 వేల మంది ఉద్యోగుల‌పై ఈ లేఆఫ్స్ ప్ర‌భావం ప‌డ‌నుంది. వ‌చ్చే నెల అంటే మేలోనే ఈ తొల‌గింపులు ఉంటాయ‌ని సంబంధిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ ప్ర‌ముఖ వార్తాసంస్థ రాయిట‌ర్స్ నివేదించింది.

నివేదిక‌ల ప్ర‌కారం.. 2025 డిసెంబర్ 31 నాటికి మెటాలో మొత్తం 79,000 మంది ఉద్యోగులు ఉన్నారు. త‌న మొత్తం వ‌ర్క్‌ఫోర్స్‌లో 20 శాతం లేదా అంత‌కంటే ఎక్కువ మందిని తొల‌గించాల‌ని సంస్థ యోచిస్తోంది. అంటే సుమారు 16 వేల మంది ఉద్యోగులు త‌మ కొలువుల‌ను కోల్పోనున్నారు. ఇక తొలి విడ‌త‌లో భాగంగా మే 20 నాటికి 10 శాతం మందికి లేఆఫ్స్ ఇవ్వాల‌ని సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది చివ‌రిలో మ‌రిన్ని తొల‌గింపులు ఉంటాయ‌ని స‌మాచారం. అయితే, ఈ లేఆఫ్స్ గురించి సంస్థ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఈ తొల‌గింపులు నిజ‌మైతే 2022-23 త‌ర్వాత మెటా చేప‌ట్ట‌బోయే అతి పెద్ద లేఆఫ్స్ ఇవే అవుతాయి. 2022 చివ‌ర్లో మెటా 11 వేల మందిని తొల‌గించిన విష‌యం తెలిసిందే.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్ర‌గామిగా ఎదిగేందుకు మెటా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే డేటా సెంటర్ల నిర్మాణానికి 2028 నాటికి 600 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్రణాళికలు రూపొందించినట్లు కూడా మెటా తెలిపింది. ఇటీవలే మెటా సంస్థ మోల్ట్‌బుక్ అనే ఏఐ ఏజెంట్ల కోసం రూపొందించిన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేసింది. అలాగే చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ మానస్ ను కొనుగోలు చేయడానికి కనీసం 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడుల వల్ల సంస్థలో సామర్థ్యం పెరుగుతుందని జుకర్‌బర్గ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు సంస్థ సిద్ధ‌మైంది. త‌న మొత్తం శ్రామిక శ‌క్తిలో దాదాపు 20 శాతం కోత విధించాల‌ని (16 వేల మంది) సంస్థ యోచిస్తున్న‌ట్లు రాయిట‌ర్స్ నివేదించింది.

ఇదిలా ఉండ‌గా.. 2026లో ప్ర‌పంచ వ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొల‌గింపులు ఎక్కువ‌య్యాయి. ఈ ఏడాది మొద‌టి త్రైమాసికంలోనే ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 80,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒరాకిల్‌, అమెజాన్‌, మెటా వంటి అంతర్జాతీయ కంపెనీల్లో ఈ ఏడాది ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 3 ల‌క్ష‌ల మార్క్‌ను దాటే అవ‌కాశం ఉంద‌ని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

Also Read..

మిడ్ ఎయిర్‌లో ఏసీ బంద్‌.. ఇండిగో విమానంలో ప్ర‌యాణికులు ఉక్కిరిబిక్కిరి

ఇట‌లీ ప్ర‌ధాని మెలోనీని హ‌గ్ చేసుకుని ముద్దు పెట్టుకున్న ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మాక్రాన్‌

రూ.1 ల‌క్ష పెట్టుబ‌డికి రూ.2 ల‌క్ష‌ల రిట‌ర్న్స్.. మోతీలాల్ ఓస్వాల్ టాప్ 3 మ్యుచువ‌ల్ ఫండ్స్‌..

Advertisement
Advertisement