Indigo Flight | మిడ్ ఎయిర్లో ఏసీ బంద్.. ఇండిగో విమానంలో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
Indigo Flight | విమానాల్లో (Indigo Flight) సాంకేతిక సమస్యలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏసీ పనిచేయక (AC Fails) పోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చేసేదేమీ లేక చేతులకు పనిచెప్పారు.
Indigo Flight | త్రినేత్ర.న్యూస్: విమానాల్లో (Indigo Flight) సాంకేతిక సమస్యలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏసీ పనిచేయక (AC Fails) పోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చేసేదేమీ లేక చేతులకు పనిచెప్పారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండిగో విమానం 6E 6684 హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్తున్నది. మార్గ మధ్యలో విమానంలో ఏసీ విఫలమైంది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకోవడానికీ ఇబ్బంది పడ్డారు. గాలి ఆడకపోవడంతో వారంతా అల్లాడిపోయారు. చాలామంది చెమటతో తడిపోయారు. చేసేదేమీ లేక పేపర్లు, మ్యాగజైన్లు, చేతులతో గాలి ఊపుకున్నారు. ఇక విమానంలో చిన్నపిల్లల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనీస సౌకర్యాలు కల్పించనందుకు ఆగ్రహించిన ప్రయాణికులు విమానయాన సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నది.
ఇండిగో విమానంలో ఏసీ బంద్..గాలి అందక ఉక్కిరిబిక్కిరైన ప్రయాణికులు
గాలి కోసం పేపర్లతో విసురుకుంటూ తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో (6E 6684) విమానంలో ఘటన
కనీస సౌకర్యాలు లేకపోవడంతో విమానయాన సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం
Indigo Passengers Suffer as AC… pic.twitter.com/QnKVfGla6z
— BIG TV Breaking News (@bigtvtelugu) April 18, 2026
సంబంధిత వార్తలు

MP Raghunandan Rao | ఇప్పుడు ఆకలైతుంది బువ్వ పెట్టమంటే.. వచ్చే ఏడాది పెడ్తడట రేవంత్రెడ్డి
ఆగస్టు 24, 2026

Keralam Travel | కేరళంలో ఈ ప్రదేశాలు చూస్తే.. ప్రకృతి అందాలకు ఫిదా అవ్వాల్సిందే!
ఆగస్టు 24, 2026

Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ - బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?
- ●Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?
- ●Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లోనే ఎక్కువ నిరుద్యోగం
- ●ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!
- ●Heavy Rain | భారీ వర్షానికి స్తంభించిన ఢిల్లీ.. 250 విమానాలు ఆలస్యం
- ●Meheshwar Reddy | ఇక్కడ పాఠశాలల్లో వసతులు లేవంటే.. ఎక్కడో ఉన్న ‘ఆక్స్ఫర్డ్’ను తీసుకొస్తడట

Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ - బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?

Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?

Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లోనే ఎక్కువ నిరుద్యోగం

ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!



