Jet Fuel Prices | చరిత్రలో తొలిసారి డబుల్ అయిన జెట్ ఫ్యూయల్ ధర.. భారీగా పెరగనున్న విమాన ఛార్జీలు!
Jet Fuel Prices | ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు (Aviation Turbine Fuel) చరిత్రలో ఎన్నడూ లేనంతగా రెట్టింపయ్యాయి. ఫలితంగా విమాన టికెట్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
Jet Fuel Prices | మధ్యప్రాచ్యంలో (Middle East) కొనసాగుతన్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇప్పటికే భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా షాకింగ్ వార్త విమాన ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం విమాన ప్రయాణికులకు పెను భారంగా మారబోతోంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు (Aviation Turbine Fuel) చరిత్రలో ఎన్నడూ లేనంతగా రెట్టింపయ్యాయి. ఫలితంగా విమాన టికెట్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
చమురు కంపెనీలు ప్రతీ నెలా ఒకటవ తేదీన ఇంధన ధరలను సవరిస్తుంటాయన్న విషయం తెలిసిందే. ఇవాళ కూడా ఆయిల్ కంపెనీలు ధరలను సవరించాయి. జెట్ ఇంధనం ధర రెట్టింపు చేశాయి. ఫలితంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర కిలోలీటర్‌కు రూ.1,10,703 పెరిగి రూ.2.07 లక్షలకు చేరింది. గతంలో దీని ధర రూ.96,638గా ఉండేది. అంటే ఏకంగా 114.5 శాతం పెరిగింది. ఏటీఎఫ్ ధర రూ.2 లక్షల మార్కును దాటడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇక దేశీయ విమానయాన సంస్థలకు (Domestic Airlines) మాత్రం ఈ పెంపు 8.5శాతం మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీలో దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు సుమారు రూ.1.04 లక్షలుగా ఉంది. కోల్‌కతా, చెన్నై నగరాల్లో రూ.1.09 లక్షలు, ముంబైలో కిలోలీటరుకు రూ.98 వేలుగా ఏటీఎఫ్ ధర ఉంది. విదేశీ రూట్లకు మాత్రం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) పూర్తి స్థాయి ధరల పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం ఇంధనానికే ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఇంత భారీగా పెరిగిన ధరల భారాన్ని తట్టుకోవడం కంపెనీలకు అసాధ్యం. దీంతో ఈ భారాన్ని ప్రయాణికులపైనే మోపుతాయి. ఫలితంగా విమాన టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
Also Read..
నేటి నుంచి జన గణన షురూ.. ఎన్యూమరేటర్లు 33 ప్రశ్నలు ఇవే..
తెల్లవారగానే పిడుగులాంటి వార్త.. 30 వేల మందిపై ఒరాకిల్ వేటు.. భారత్‌లో 12 వేల మందికి ఉద్వాసన
యుద్ధం ముగియబోతుందని సంకేతాలు.. భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు..
సంబంధిత వార్తలు

Windfall Tax | యుద్ధ ప్రభావం.. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను పెంపు
జులై 16, 2026

Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం
జులై 15, 2026

PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది : ప్రధాని మోదీ
జులై 4, 2026
తాజావార్తలు
- ●RBI | బ్యాంకులకు ఆర్బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..
- ●Boats Capsized | మయన్మార్ తీరంలో 500 మంది జలసమాధి..!
- ●Ramdas Athawale | ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కచ్చితంగా ఆమోదం పొందుతాయి : కేంద్ర మంత్రి
- ●MLC Venkatarami Reddy | మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలే.. ఆ వార్తలు నిరాధారం.. అరెస్ట్ కూడా కాలేదు..
- ●Hydrogen Train | దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు.. విశేషాలు ఇవే..
- ●BRS former MLAs | మామునూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఘనత బీఆర్ఎస్దే.. అప్పుడే 253 ఎకరాలకు ఆమోదం వచ్చింది

RBI | బ్యాంకులకు ఆర్బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..

Boats Capsized | మయన్మార్ తీరంలో 500 మంది జలసమాధి..!

Ramdas Athawale | ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కచ్చితంగా ఆమోదం పొందుతాయి : కేంద్ర మంత్రి

MLC Venkatarami Reddy | మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలే.. ఆ వార్తలు నిరాధారం.. అరెస్ట్ కూడా కాలేదు..



