త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Venkatarami Reddy | మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలే.. ఆ వార్తలు నిరాధారం.. అరెస్ట్ కూడా కాలేదు..

MLC Venkatarami Reddy | త‌మ అబ్బాయి భరత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్టు.. మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు ఆయ‌న తాజాగా స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం.. అవాస్తవమ‌ని కొట్టిపారేశారు.

S

Flash news | Published On Jul 16, 2026, 1.24 pm IST

MLC Venkatarami Reddy | మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలే.. ఆ వార్తలు నిరాధారం.. అరెస్ట్ కూడా కాలేదు..
Advertisement
  • ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి

MLC Venkatarami Reddy |  త్రినేత్ర‌.న్యూస్‌: త‌మ అబ్బాయి భరత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్టు.. మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు ఆయ‌న తాజాగా స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం.. అవాస్తవమ‌ని కొట్టిపారేశారు. గురువారం ఉదయం మంగళ్‌హాట్ పోలీసులు మా ఇంటికి వచ్చి డ్రగ్స్ కు సంబంధిచిన కేసు విచారణ జరుపుతున్నామని, విచారణకు సహకరించాలని కోరారని వెల్ల‌డించారు.

టెస్ట్ లో నెగటివ్ వచ్చింది..

భరత్‌ను స్టేషన్‌కు రావాలని కోరారు. పోలీసుల సూచన మేరకు భరత్ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులు విచారణ జ‌రిపారు. భరత్‌కు డ్రగ్స్ టెస్ట్ కూడా చేశారు. టెస్ట్ లో నెగటివ్ వచ్చింది. నా కుమారుడు డ్రగ్స్ తీసుకోలేదు. కామన్ ఫ్రెండ్స్ ఫోన్ జాబితాలో ఉన్నవారెవరి నంబర్‌లోనో ఒకరి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా విచారణకు పిలిచారు. భరత్ అరెస్ట్ కాలేదు. డ్రగ్స్ తీసుకోలేదు అని మ‌రోమారు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement