Boats Capsized | మయన్మార్ తీరంలో 500 మంది జలసమాధి..!
Boats Capsized | మయన్మార్ (Myanmar) తీర ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోహింగ్యా శరణార్థులు ప్రయాణిస్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో (Bay of Bengal ) మునిగిపోయాయి (Boats Capsized). ఈ ఘటనలో 500 మంది జలసమాధి అయినట్లు ఐక్యరాజ్యసమితి (UN) సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
International | Published On Jul 16, 2026, 1.56 pm IST
Boats Capsized | మయన్మార్ (Myanmar) తీర ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యుద్ధంతో అతలాకుతలమైన మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు ప్రయాణిస్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో (Bay of Bengal ) మునిగిపోయాయి (Boats Capsized). ఈ ఘటనలో 500 మంది జలసమాధి అయినట్లు ఐక్యరాజ్యసమితి (UN) సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ మేరకు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM), ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (UNHCR) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటన ప్రకారం.. జూన్ నెలాఖరులో మయన్మార్‌లోని రఖౌన్ రాష్ట్రం నుంచి 500 మందికిపైగా మైనారిటీ రోహింగ్యాలతో (minority Rohingyas) రెండు నౌకలు బయల్దేరాయి. 250 మందితో వెళ్తున్న మొదటి పడవ.. బయల్దేరిన కాసేపటికే కాంటాక్ట్ తెగిపోయింది. దాదాపు 280 మందితో వెళ్తున్న రెండో నౌక జూలై 8న మయన్మార్‌లోని ఇరావాడి తీరంలో మునిగిపోయింది. ఈ రెండు ప్రమాదాల్లో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి (UN) సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మయన్మార్‌లో దశాబ్దాలుగా రోహింగ్యాలు హింసకు గురవుతున్నారు. దీంతో తమ దేశంలో అణచివేత, అంతర్యుద్ధం నుంచి తప్పించుకునేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్ర మార్గం గుండా బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. 2017లో లక్షలాది మంది రోహింగ్యాలు మయన్మార్‌ను వీడి బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. 2021లో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు అనంతరం.. ఈ వలసలు మరింత పెరిగాయి. చెక్క బోట్లలో వందలాది మంది ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. గతేడాది కూడా వందలాది మంది రోహింగ్యాలు సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తూ జలసమాధి అయ్యారు.
Also Read..
ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కచ్చితంగా ఆమోదం పొందుతాయి : కేంద్ర మంత్రి
మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలే.. ఆ వార్తలు నిరాధారం.. అరెస్ట్ కూడా కాలేదు..
ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది.. వాంగ్‌చుక్‌కు వైద్యం అందించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
తాజావార్తలు
- ●Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
- ●POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష
- ●Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం
- ●Ai Plus | పండుగ సీజన్‌కు ఏఐ ప్లస్ కొత్త గ్యాడ్జెట్లు.. రూ.9,999 నుంచి ధరలు..
- ●Supreme Court | 9 శాతం మంది విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచనలు.. NTF సర్వేలో షాకింగ్ విషయాలు
- ●TTD | తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు.. ఏయే తేదీల్లో అంటే?

Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..

POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష

Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం

Ai Plus | పండుగ సీజన్‌కు ఏఐ ప్లస్ కొత్త గ్యాడ్జెట్లు.. రూ.9,999 నుంచి ధరలు..






