Ramdas Athawale | ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కచ్చితంగా ఆమోదం పొందుతాయి : కేంద్ర మంత్రి
Ramdas Athawale | రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Monsoon Session of Parliament) మహిళా రిజర్వేషన్ (Womens Reservation Bill), డీలిమిటేషన్ బిల్లులు (Delimitation Bill) కచ్చితంగా ఆమోదం పొందుతాయని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే (Ramdas Athawale) పేర్కొన్నారు.
Ramdas Athawale | రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Monsoon Session of Parliament) మహిళా రిజర్వేషన్ (Womens Reservation Bill), డీలిమిటేషన్ బిల్లులు (Delimitation Bill) కచ్చితంగా ఆమోదం పొందుతాయని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే (Ramdas Athawale) పేర్కొన్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ పార్టీలు వ్యతిరేకించడం వల్లే ఈ రాజ్యాంగ సవరణ బిల్లులకు మద్దతు లభించలేదన్నారు. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారాయని చెప్పారు. ఈ చట్టాన్ని ఆమోదించడానికి అధికార ఎన్డీయే కూటమికి పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల (two-thirds) మెజారిటీ ఉందని చెప్పారు. ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులు కచ్చితంగా ఆమోదం పొందుతాయని ధీమా వ్యక్తం చేశారు.
"ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ ఉంది. రాబోయే సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు సభ ముందుకు వస్తుంది. 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు లభిస్తాయి" అని అథవాలే వెల్లడించారు. పునర్విభజన అనేది ప్రతి 35 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా చేపట్టే రాజ్యాంగ ప్రక్రియ అని స్పష్టం చేశారు. దీనిని వ్యతిరేకించడం సరికాదన్నారు. డీలిమిటేషన్ ద్వారానే మహిళలకు రిజర్వేషన్లు, పార్లమెంటులో సీట్ల పెంపుదల సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఈ బిల్లులకు లోక్‌సభలో మెజారిటీ లభించనప్పటికీ.. ప్రస్తుతం ఎన్డీయే (NDA)కు స్పష్టమైన మెజారిటీ ఉందని చెప్పారు. ఇటీవలే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఎన్డీయేకి మరింత బలోపేతం చేశాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రతిపాదిత బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.
జులై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు..
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు (Monsoon session) జులై 20 నుంచి జరగనున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర రాజకీయ పోరు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించే దిశగా అడుగులు వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ సమావేశాల సందర్భంగా రెండు రాజ్యాంగ సవరణ బిల్లులతోసహా పలు కీలక బిల్లులను ఆమోదింపచేసేందుకు సిద్ధమవుతోంది.
సభ ముందుకు కీలక బిల్లులు..
గతంలో ప్రతిపక్షాలు అడ్డుకున్న డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill), మహిళల రిజర్వేషన్ బిల్లులను ఈ సెషన్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటూ తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో ప్రధాని, సీఎం అరెస్టై వరుసగా 30 రోజులకుపైగా జైలులో ఉంటే ఆటోమేటిక్‌గా పదవి రద్దయ్యేలా బిల్లును తీసుకురాబోతున్నది. గతేడాది నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల అభ్యంతరాలతో పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అప్పగించిన విషయం తెలిసిందే. బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ జూలై 17న తన నివేదికను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నివేదికను లోక్‌సభకు సమర్పించనున్నారు.
Also Read..
ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది.. వాంగ్‌చుక్‌కు వైద్యం అందించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం
మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలే.. ఆ వార్తలు నిరాధారం.. అరెస్ట్ కూడా కాలేదు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..
- ●Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే
- ●Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్
- ●Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
- ●POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష
- ●Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం

Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..

Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే

Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..






