Census 2027 | నేటి నుంచి జన గణన షురూ.. ఎన్యూమరేటర్లు 33 ప్రశ్నలు ఇవే..
Census 2027 | ప్రపంచంలోనే అతిపెద్ద జన గణన (Census 2027) కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. దేశ భవిష్యత్తు ప్రణాళికలకు అత్యంత కీలకమైన ఈ ప్రక్రియలో తొలిదశ బుధవారం షురూ అయింది.
Census 2027 | త్రినేత్ర.న్యూస్: ప్రపంచంలోనే అతిపెద్ద జన గణన (Census 2027) కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. దేశ భవిష్యత్తు ప్రణాళికలకు అత్యంత కీలకమైన ఈ ప్రక్రియలో తొలిదశ బుధవారం షురూ అయింది. దేశవ్యాప్తంగా మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. 7,092 మండలాలు, తాలూకాలు.. 5128 మున్సిపాలిటీలు.. 6,39,902 గ్రామాలలో రెండు దశల్లో జనగణన చేయనున్నారు. తొలి దశ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు సాగనుంది. ఇందులో భాగంగా గృహగణన, వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తారు.
రెండో దశ వచ్చే ఏడాది మార్చి 1న ప్రారంభమవుతుంది. అప్పడు జనాభాను లెక్కించడంతోపాటు కులాల గణన కూడా జరుగనుంది. ఇది దేశవ్యాప్తంగా జరిగే 16వ జనగణన కాగా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇది 8వది. తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో జనగణన జరుగుతున్నది. ఇందులో భాగంగా సేకరించే వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారని, ఏ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థతోనూ కేంద్రం పంచుకోదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా, జనాభా లెక్కల ప్రక్రియ రాష్ట్రంలో మే నెల 11 నుంచి జూన్ 9 వరకు జరుగనుంది. దీనికి 15 రోజుల ముందు నుంచి సెల్ఫ్ ఎన్యూమరేటర్ పోర్టల్‌లో ప్రజలు తమ గృహ సంబంధ వివరాలను స్వయంగా నమోదు చేయొచ్చు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీడాక్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా మొత్తం 16 భారతీయ భాషల్లో వివరాల నమోదు కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు తమ వివరాలను తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే 'సెల్ఫ్-ఎన్యుమరేషన్' సౌకర్యం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య 15 రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ఈ గడువు మారుతూ ఉంటుంది. గృహాల జాబితా ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయం, ఎల్‌పిజి, నీరు, పారిశుధ్యం వంటి 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని విడుదల చేసింది.

ఆ 33 ప్రశ్నలు ఇవే..
- భవన సంఖ్య (పురపాలక లేదా స్థానిక అధికార సంస్థ లేదా జనాభా లెక్కల సంఖ్య)
- ఇంటి సంఖ్య
- ఇంటి నేల కోసం ప్రధానంగా ఉపయోగించిన పదార్థం
- ఇంటి గోడల కోసం ప్రధానంగా ఉపయోగించిన పదార్థం
- ఇంటి పైకప్పు కోసం ప్రధానంగా ఉపయోగించిన పదార్థం
- ఇంటి ఉపయోగం
- ఇంటి పరిస్థితి
- కుటుంబ సంఖ్య
- కుటుంబ సభ్యుల సంఖ్య
- కుటుంబ పెద్ద పేరు
- కుటుంబ పెద్ద లింగం
- షెడ్యూల్డ్ కులం / షెడ్యూల్డ్ తెగ / ఇతర
- ఇంటి యాజమాన్య స్థితి
- ఇంటిలోని గదుల సంఖ్య
- కుటుంబంలోని వివాహిత జంటల సంఖ్య
- తాగునీటి ప్రధాన వనరు
తాగునీటి వనరు లభ్యత
ప్రధాన లైటింగ్ వనరు
టాయిలెట్ సౌకర్యం లభ్యత
టాయిలెట్ రకం
మురుగునీటి పారుదల సౌకర్యం
స్నానపు సౌకర్యం లభ్యత
వంటగది, ఎల్‌పిజి / పిఎన్‌జి కనెక్షన్
- వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం
- రేడియో / ట్రాన్సిస్టర్
- టెలివిజన్
- ఇంటర్నెట్ సౌకర్యం
- ల్యాప్‌టాప్ / కంప్యూటర్
- టెలిఫోన్ / మొబైల్ ఫోన్ / స్మార్ట్‌ఫోన్
- సైకిల్ / స్కూటర్ / మోటార్‌సైకిల్ / మోపెడ్
- కారు / జీప్ / వ్యాన్
- ప్రధానంగా తినే ధాన్యం
- మొబైల్ నంబర్
తాజావార్తలు
- ●Nagarjuna | అక్కినేని హీరోల మల్టీస్టారర్‌కు బ్రేక్ - బంగార్రాజు 2 ఆగిపోయిందా? ఆపేశారా?
- ●RBI | బ్యాంకులకు ఆర్బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..
- ●Boats Capsized | మయన్మార్ తీరంలో 500 మంది జలసమాధి..!
- ●Ramdas Athawale | ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కచ్చితంగా ఆమోదం పొందుతాయి : కేంద్ర మంత్రి
- ●MLC Venkatarami Reddy | మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలే.. ఆ వార్తలు నిరాధారం.. అరెస్ట్ కూడా కాలేదు..
- ●Hydrogen Train | దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు.. విశేషాలు ఇవే..

Nagarjuna | అక్కినేని హీరోల మల్టీస్టారర్‌కు బ్రేక్ - బంగార్రాజు 2 ఆగిపోయిందా? ఆపేశారా?

RBI | బ్యాంకులకు ఆర్బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..

Boats Capsized | మయన్మార్ తీరంలో 500 మంది జలసమాధి..!

Ramdas Athawale | ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కచ్చితంగా ఆమోదం పొందుతాయి : కేంద్ర మంత్రి






