Anant Ambani | అనంత్ చేతికి శివుడి థీమ్‌తో ప్రత్యేకమైన వాచ్.. ధర, ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!
Anant Ambani | అనంత్ అంబానీ (Anant Ambani) ఖరీదైన వాచ్‌తో అందరినీ ఆకర్షిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి లగ్జరీ వాచ్ మేకర్ ‘జాకబ్ అండ్ కో’ (Jacob And Co) రూపొందించిన అత్యంత అరుదైన 'ఒపెరా గాడ్‌ఫాదర్ బాగెట్ శివ' (Opera Godfather Baguette Shiva) వాచ్‌తో కనిపించారు.
Anant Ambani | ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఫ్యామిలీ ఎంత లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తుందో అందరికీ తెలిసిందే. వారు వాడే వస్తువులు, ధరించే దుస్తులు, కార్లు, జ్యువెల్లరీ ఇలా ఒకటేంటి అన్నీ చాలా ఖరీదైనవే ఉంటాయి. వారి దగ్గర ఉండే వస్తువులు అన్నీ ప్రత్యేక ఎడిషన్‌వే ఉంటాయి. ఇక అంబానీ కుటుంబంలో అనంత్ అంబానీ (Anant Ambani) గురించి ప్రత్యేకంగా పరిచయమే అక్కర్లేదు. ముఖ్యంగా ఆయన వాచ్ కలెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అనంత్ దగ్గర ఎన్నో ఖరీదైన వాచ్‌లు ఉన్నాయి. మార్కెట్‌లోకి కొత్త గడియారం వచ్చిందంటే చాలు అది తన వాచ్ కలెక్షన్‌లో చేరిపోవాల్సిందే. అనంత్ వద్ద ఇప్పటకే రూ.కోట్లు ఖరీదు చేసే వాచ్‌లు ఉన్నాయి. రిచర్డ్ మిల్లె (Richard Mille), ఆడెమర్స్ పిగ్యెట్ (Audemars Piguet) వంటి బ్రాండ్‌లు, ప్రత్యేకమైన వజ్రాలు, రత్నాలతో పొదిగిన గడియారాలు, ప్రపంచంలోనే పరిమిత సంఖ్యలో తయారైన వాచీలు ఉన్నాయి. అనంత్ అంబానీ అప్పుడప్పుడు వాటిని ధరించి వాచ్‌లపై తనకున్న ఇష్టాన్ని అందరికీ తెలియజేస్తుంటారు. అంతేకాదు, ప్రత్యేకమైన ఈవెంట్స్ సమయంలో తన ఫ్రెండ్స్‌కు కూడా ఖరీదైన వాచ్‌లను గిఫ్ట్‌గా ఇస్తుంటారు.
ఇప్పుడు మరో ఖరీదైన వాచ్‌తో అనంత్ అందరినీ ఆకర్షిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి లగ్జరీ వాచ్ మేకర్ ‘జాకబ్ అండ్ కో’ (Jacob And Co) రూపొందించిన అత్యంత అరుదైన 'ఒపెరా గాడ్‌ఫాదర్ బాగెట్ శివ' (Opera Godfather Baguette Shiva) వాచ్‌తో కనిపించారు. ఇదొక "మ్యూజికల్ మాస్టర్‌పీస్". ఈ వాచ్ మధ్యలో శివుని (Shiva) విగ్రహం ఉంటుంది. వాచ్ డయల్‌పై ప్రత్యేకంగా ఓం గుర్తును రూపొందించారు. అంతేకాదు, వాచ్ లోపల ఓ మ్యూజిక్ బాక్స్ ఉంటుంది. అది ఓ ప్రత్యేకమైన మ్యూజిక్‌ను ప్లే చేస్తుంది. దీన్ని 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో, దాదాపు 1000కిపైగా బాగెట్ కట్ వజ్రాలతో అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు.ఇక ధర విషయానికొస్తే 'వాచ్ ఆఫ్ లక్సీ' (Watch of Luxy) ప్రకారం.. ఈ వాచ్ ఖరీదు రూ.18 కోట్లకు పైమాటే (2 మిలియన్ డాలర్లు). ప్రస్తుతం ఈ వాచ్ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
Also Read..
రూ.150కే పట్టుచీర.. ఈ హోల్‌సేల్ మార్కెట్ల గురించి తెలుసా..?
అద్దె బకాయిలు.. కోహ్లీ రెస్టారెంట్ మూసివేత
30లలో ఉన్నవారికి వైద్యుల అలర్ట్.. బ్లడ్ ప్రెషర్ కాస్త ఎక్కువ ఉన్నా జాగ్రత్త వహించాల్సిందే..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






