Virat Kohli | అద్దె బకాయిలు.. కోహ్లీ రెస్టారెంట్ మూసివేత
Virat Kohli | బెంగళూరు (Bengaluru)లో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి చెందిన వన్8 కమ్యూన్ (One8 Commune) రెస్టారెంట్ మూతపడింది. అద్దె బకాయిలు (rent dues) చెల్లించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు మూసివేశారు.
Virat Kohli | బెంగళూరు (Bengaluru)లో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి చెందిన వన్8 కమ్యూన్ (One8 Commune) రెస్టారెంట్ మూతపడింది. చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్‌ను దాదాపు రూ.2 కోట్లకు పైగా అద్దె బకాయిలు (rent dues) చెల్లించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు మూసివేశారు. ఈ రెస్టారెంట్‌కు కోహ్లీ గతంలో సహయజమానిగా ఉండేవారు. అయితే, రెస్టారెంట్ అద్దె బకాయిలు, సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనల వంటి కారణాలతో కోహ్లీ తన బ్రాండ్ పేరును ఆ అవుట్లెట్ నుంచి ఉపసంహరించుకున్నారు.
ఇండియా టుడే కథనం ప్రకారం.. వన్ 8 కమ్యూన్ (One8 Commune) పబ్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు (Fire Safety Violations) బెంగళూరు బృహత్ మహానగర పాలిక అధికారులు పదేపదే నోటీసులు పంపారు. అంతేకాదు, ఈ పబ్‌లో స్మోకింగ్ జోన్ లేకపోవడం, నిర్దేశిత సమయానికి మించి పనిచేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఈ పబ్‌పై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. ఇక అద్దె బకాయిలు కూడా పేరుకుపోయాయి. పబ్ నిర్వాహకులు రూ.2కోట్ల అద్దె బకాయి పడినట్లు బిల్డింగ్ యజమాని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బకాయిలన్నీ చెల్లించే వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో దీంతో వన్ 8 కమ్యూన్ను నిర్వాహకులు మూసివేశారు.
కాగా, ఈ పబ్‌కు వరుస కేసులు, నోటీసులు వస్తుండటంతో కోహ్లీ తన వన్8 బ్రాండ్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో కస్టమర్ల సంఖ్య తగ్గింది. ఫలితంగా వ్యాపారం భారీ నష్టాల్లో కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది. అందుకే గత ఆరు నెలలుగా నిర్వాహకులు అద్దె కూడా చెల్లించలేదని తెలిసింది. దీంతో బిల్డింగ్ యజమాని కోర్టుకు ఆశ్రయించినట్లు ఇండియా టుడే నివేదిక వెల్లడించింది.
Also Read..
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు.. హర హర మహాదేవ్ నామస్మరణలతో మార్మోగిన పుణ్యక్షేత్రం
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

IPL 2026 Playoffs Schedule | ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. అహ్మదాబాద్‌లో 31న ఫైనల్..!
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



