త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anant Ambani | టీటీడీకి భారీ విరాళం ప్ర‌క‌టించిన అనంత్ అంబానీ..

Anant Ambani | ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) టీటీడీకి (TTD) భారీగా విరాళాలు ప్ర‌క‌టించారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

G

National | Published On Jun 28, 2026, 12.12 pm IST

Anant Ambani | టీటీడీకి భారీ విరాళం ప్ర‌క‌టించిన అనంత్ అంబానీ..
Advertisement

Anant Ambani | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) టీటీడీకి (TTD) భారీగా విరాళాలు ప్ర‌క‌టించారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వ‌చ‌నం అందించ‌గా, అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సంద‌ర్భంగా అనంత్ అంబానీ టీటీడీకి రూ.27.5 కోట్ల వ్యయంతో 25 ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) విరాళంగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 50 మంది డ్రైవ‌ర్ల‌కు జీత‌భ‌త్యాలు కూడా చెల్లించ‌డంతోపాటు.. వాటి నిర్వహణకు అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సైతం నిధులు కేటాయిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement