Minister Jupally Krishna Rao | తెలంగాణ నీటి కేటాయింపుల్లో రాజీ పడం: మంత్రి జూపల్లి
Minister Jupally Krishna Rao | నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం(Srishailam)లో ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి (Power production) చేస్తోందని, తాము హెచ్చరించడంతోనే ఉత్పత్తిని నిలిపి వేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తెలిపారు. తెలంగాణ నీటి కేటాయింపుల్లో రాజీ పడమని స్పష్టం చేశారు.
త్రినేత్ర.న్యూస్: నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం(Srishailam)లో ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి (Power production) చేస్తోందని, తాము హెచ్చరించడంతోనే ఉత్పత్తిని నిలిపి వేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తెలిపారు. తెలంగాణ నీటి కేటాయింపుల్లో రాజీ పడమని స్పష్టం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ లో కనిష్ట నీటి మట్టం స్థాయి 834 అడుగుల (254.2 మీటర్లు)కు చేరుకున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయొద్దనే నిబంధన ఉందన్నారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా ఏపీ సర్కార్ అక్రమంగా, అన్యాయంగా నీటిని తోడేస్తుందని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మా హెచ్చరికలతోనే ఏపీ వెనక్కి..
విద్యుత్తు ఉత్పత్తి అంశంపై ఎన్నిసార్లు విన్నవించినా ఏపీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. అందుకే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం, కృష్ణా పరీవాహక ప్రాంత జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులం శ్రీశైలం వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చామని, మా హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసిందని చెప్పారు.
రైతు పక్షాన నిలబడతం..
ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులం సిద్ధంగా ఉన్నాం. పాలమూరు జిల్లాకు నష్టం జరిగితే రైతు పక్షాన ప్రభుత్వం పోరాడుతుందని, ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని వెల్లడించారు. ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకొనేది లేదన్నారు.
ఏపీ ప్రభుత్వం భవిష్యత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు. సమాఖ్య రాష్ట్రంలో ఇలాగే వ్యవహరిస్తే ఆందోళన చేపట్టామని, హై కోర్టును కూడా ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. అప్పుడు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని జూపల్లి స్పష్టం చేశారు.
Also Read..
Paadi Koushik Reddy | ఎన్ని నోటీసులిచ్చినా వెనక్కి తగ్గను: పాడి కౌశిక్ రెడ్డి
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



