త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

టూరిజం ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లకు మంత్రి జూపల్లి గుడ్ న్యూస్ చెప్పారు. బెస్ట్ క్రియేటర్లకు అవార్డులతో పాటు త్వరలో 'ప్రభాత భేరి' ప్రోగ్రామ్ తేనున్నారు.

J

Hyderabad | Published On May 21, 2026, 10.00 pm IST

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
Advertisement
  • తెలంగాణ పర్యాటక రంగాన్ని గ్లోబల్ లెవల్‌లో ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లకు, యూట్యూబర్లకు అవార్డులు
  • డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై యువతలో అవగాహన పెంచేలా కంటెంట్ క్రియేట్ చేయాలని మంత్రి జూపల్లి పిలుపు
  • సామాజిక చైతన్యం కోసం షార్ట్ ఫిల్మ్స్, నాటకాల ద్వారా త్వరలో ‘ప్రభాత భేరి’ అనే కొత్త కార్యక్రమం
  • తెలంగాణ టూరిజం కొత్త మెటా, అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ఆవిష్కరణ

Jupally Krishna Rao | త్రినేత్ర.న్యూస్ : పర్యాటక రంగాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై పరుగులు పెట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన ‘తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశం’లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు, కంటెంట్ క్రియేటర్లకు మంత్రి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. టూరిజం ప్రమోషన్‌లో కీ రోల్ ప్లే చేసే ఉత్తమ క్రియేటర్లకు అవార్డులతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు.

టూరిజం ప్రమోషన్.. సోషల్ రెస్పాన్సిబిలిటీ

క్రియేటర్లు కేవలం లైక్స్, వ్యూస్ కోసమే కాకుండా.. సామాజిక బాధ్యతతో (Social Responsibility) కంటెంట్ చేయాలని మంత్రి జూపల్లి సూచించారు. ప్రస్తుత రోజుల్లో కొందరు యువత గంజాయి, డ్రగ్స్, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్స్ (Online Betting) బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిలో మార్పు తీసుకొచ్చేలా ఇన్ఫ్లుయెన్సర్లు తమ కంటెంట్ ద్వారా చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.

త్వరలో ‘ప్రభాత భేరి’ ప్రోగ్రామ్

సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ‘ప్రభాత భేరి’ (Prabhata Bheri) అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోందని మంత్రి వెల్లడించారు. షార్ట్ ఫిల్మ్స్, నాటికలు, వివిధ కళా రూపాల ద్వారా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు స్పెషల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు చెప్పారు. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యా, వైద్య రంగాలకు ఉపయోగిస్తామన్నారు. ఖాళీగా ఉన్న హరిత మోటళ్లు, పర్యాటక భూములను ఆదాయ వనరులుగా మారుస్తామని తెలిపారు.

Telangana Tourism Announces Awards and Incentives for Digital Creators

గ్లోబల్ మ్యాప్‌లో తెలంగాణ బ్రాండ్

రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ (Digital Platforms) ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడంలో క్రియేటర్లు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ఇదే వేదికపై తెలంగాణ టూరిజం అఫీషియల్ మెటా (Meta), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలను ఆయన లాంచ్ చేశారు. అలాగే తెలంగాణ సంస్కృతి, కలంకారీ కళా వైభవాన్ని చూపే ‘టైమ్‌లెస్ తెలంగాణ’ (Timeless Telangana) స్పెషల్ వీడియోను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, ఎండీ గౌతమి, వివిధ అకాడమీల డైరెక్టర్లు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement