త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.5,681 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. రాష్ట్రం ప్రతిపాదించకపోయినా కరీంనగర్‌కు బండి సంజయ్ నిధులు ఎలా సాధించారంటే?

J

Telangana | Published On May 21, 2026, 9.54 pm IST

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
Advertisement
  • కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) కింద తెలంగాణకు రూ.5,681 కోట్ల నిధులు మంజూరు
  • వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్‌లలో 3 మెగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
  • కరీంనగర్‌ అభివృద్ధి కోసం ఏకంగా రూ.840 కోట్ల భారీ ప్యాకేజీని సాధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా, పీఎం మోదీకి స్వయంగా ప్రాజెక్ట్ వివరించి నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడి

Telangana UCF funds | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (Urban Challenge Fund - UCF) కింద తెలంగాణలోని మూడు మెగా ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ.5,681 కోట్లను మంజూరు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ తుది ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు తెలంగాణ నగరాల రూపురేఖలను పూర్తిగా మారుస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన 'ఎక్స్' ఖాతా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

ఆ 3 మెగా ప్రాజెక్టులు ఇవే..

కేంద్రం ఆమోదించిన ఈ నిధులతో వరంగల్, కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల్లో భారీ మౌలిక సదుపాయాల పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్టుల వారీగా నిధుల వివరాలు ఇలా ఉన్నాయి.

  • వరంగల్ సీవరేజ్ మోడ్రనైజేషన్ (Sewage Modernization): రూ. 4,674 కోట్లు
  • కరీంనగర్ మోడల్ రోడ్స్, ఇన్ఫ్రా (Model Roads & Infra): రూ. 840 కోట్లు
  • ఖమ్మం-వరంగల్-కరీంనగర్ కారిడార్ (Corridor): రూ. 166 కోట్లు

కరీంనగర్‌పై బండి సంజయ్ మార్క్

తన సొంత నియోజకవర్గం కరీంనగర్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ప్రత్యేక మార్క్ చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో (Proposals) కరీంనగర్ పేరు లేకపోయినప్పటికీ, ఆయన స్వయంగా చొరవ తీసుకున్నారు. పీఎం మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎంఎల్ ఖట్టర్‌లను స్వయంగా కలిసి కరీంనగర్ డెవలప్‌మెంట్ విజన్‌ను వివరించి ఒప్పించారు. దీని ఫలితంగా కరీంనగర్‌కు రూ. 840 కోట్ల భారీ ప్యాకేజీ మంజూరైంది.

కరీంనగర్ నిధుల బ్రేకప్ ఇలా

కరీంనగర్‌కు మంజూరైన రూ. 840 కోట్లను ఏయే పనులకు ఖర్చు చేస్తారో కేంద్ర మంత్రి స్పష్టంగా వివరించారు.

రూ. 630 కోట్లు: మోడల్ రోడ్లు, స్కైవాక్స్ (Skywalks), ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (FOBs), ప్రధాన జంక్షన్ల అభివృద్ధి కోసం.

రూ. 130 కోట్లు: వరద ముప్పు నివారణ (Flood Mitigation), స్ట్రామ్ వాటర్ డ్రైనేజీల పునరుద్ధరణ కోసం.

రూ. 80 కోట్లు: సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (Solid waste management), డంప్ యార్డ్ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం.

తొలి విడత నిధులు రిలీజ్

ఇటీవల జరిగిన అపెక్స్ కమిటీ సమావేశం, ఆ తర్వాత కేంద్ర అధికారుల ఫీల్డ్ విజిట్ (Field visit) పూర్తయ్యాక ఈ ప్రాజెక్టులకు ఫైనల్ అప్రూవల్ లభించింది. పనులు త్వరగా ప్రారంభించేందుకు కేంద్రం ఇప్పటికే తన తొలి విడత వాటా కింద రూ. 1,420.26 కోట్లను విడుదల చేసిందని బండి సంజయ్ వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్న ప్రధాని మోదీకి, మంత్రి ఎంఎల్ ఖట్టర్‌కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "మేం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం" అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement